ఫిబ్రవరి 4 శుక్రవారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు ఓ గొప్ప వ్యక్తిని కలిసిన తర్వాత మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.  మీరు మీ ఆలోచనలను నియంత్రించగలుగుతారు. అనవసరంగా ఖర్చు పెట్టే ధోరణి మార్చుకోకుంటే చాలా నష్టపోతారు. మీ సంపాదన ఆధారంగా నెలవారి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి.  పాత మిత్రులను కలిసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు లాభపడతారు. 


వృషభం
ఈ రోజు కుటుంబ సభ్యులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. మీ మనస్సు స్వీయ అధ్యయనంలో నిమగ్నమై ఉంటుంది. మీ స్నేహితుల చర్చల్లో పాత జ్ఞాపకాల గురించి చర్చిస్తారు. సాయంత్రం బంధువుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. .


మిథునం
అనవసర ఖర్చులను నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాలు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అహంకారం తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. వ్యాపార పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు మీరు మీ సోదరుల సహాయం తీసుకోవచ్చు. 


కర్కాటకం
ఈరోజు, కొన్ని పనుల్లో తొందరపాటు కారణంగా  మీరు చాలా బాధలు పడవలసి వస్తుంది. పూర్తి అంకితభావంతో, అవగాహనతో మీ బాధ్యతను నెరవేర్చండి. బైక్ లేదా కారులో సమస్య కారణంగా  మీరు సమయానికి మీ గమ్యాన్ని చేరుకోలేరు. ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నించండి. చేసే పనిలో నిజాయితీగా వ్యవహరించండి. 


సింహం
ఎప్పటి నుంచో వేధిస్తున్న ఓ పెద్ద సమస్యకు ఈ రోజు ముగింపు రావొచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందగలుగుతారు. ఏదైనా తెలియని వ్యక్తితో లావాదేవీలు జరిపే ముందు, అతని గురించి సమగ్ర సమాచారాన్ని పొందండి. పనికిరాని పనుల్లో సమయాన్ని వృధా చేయడం ద్వారా మీ సాధారణ పనిని ప్రభావితం చేయకండి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు లాభపడే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మీ పనిని ప్రారంభించండి. ఒకరి ఆలోచనల ప్రభావంతో మీరు ఆధ్యాత్మికత వైపు వెళతారు. 


కన్య 
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. స్నేహితులను కలుస్తారు..వారితో జరిగే చర్చలు వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఒకరి ప్రవర్తన కారణంగా బాధపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు మతపరమైన పనిని ఆనందిస్తారు. కుటుంబ సమేతంగా ఆలయ సందర్శనకు వెళతారు. 


తుల
ఈరోజు మీరు మీ జీవితంలో కొత్తదనాన్ని అనుభవిస్తారు. మీ విజయం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. విద్యార్థులు తమ చదువుల కష్టాలను వివిధ మాధ్యమాల ద్వారా అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త పనిలో నిమగ్నమై ఉంటారు.


వృశ్చికం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి, బహిరంగ ప్రదేశంలో ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. ఈ రోజంతా మానసిక గందరగోళంలో గడుపుతారు. ప్రవర్తనలో చిరాకు కనిపిస్తుంది. పెద్దలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆకస్మికంగా వస్తున్న కొత్త ఖర్చుల కారణంగా మీ నెలవారీ బడ్జెట్‌కు భంగం కలిగే అవకాశం ఉంది.


ధనుస్సు 
అధిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడికి కారణాలను తొలగించడానికి అనుభవజ్ఞుల నుంచి సలహా తీసుకోండి. నెమ్మదించిన వ్యాపార పరిస్థితి కారణంగా, మీరు ప్రస్తుతానికి అప్పుతీసుకున్న మొత్తం తిరిగి చెల్లించలేరు. ఈరోజు మీ ఇంటికి బంధువు వచ్చే అవకాశం ఉంది. మీరు పొదుపు పథకాలు లేదా ఏదైనా ప్రాజెక్ట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు.


మకరం 
ఈ రోజు మీ బాధ్యతను నెరవేర్చడానికి బద్దకించకండి.  సోమరితనంగా వ్యవహరించడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతినడంతో పాటూ మీపై నమ్మకాన్ని కోల్పోతారు.  తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తక్కువ పదాలు వాడండి.  ఈ రోజు మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. 


కుంభం
ఇంటికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో రోజు గడుస్తుంది. ప్రకృతి పట్ల మీకున్న ప్రేమ పెరుగుతుంది. చెట్లు, మొక్కలు లేదా ఆవులకు సేవ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.మీ చుట్టూ ఉన్న వక్రబుద్ధి గల వ్యక్తుల కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. అందరితో ప్రేమగా మాట్లాడండి. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. 


మీనం
పనిలో ఏదైనా ఇబ్బంది కారణంగా మీ మనస్సు కలవరపడవచ్చు. పదేపదే వైఫల్యాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మీ తప్పులను అర్థం చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి కుటుంబ పెద్దలు లేదా నిపుణుల సహాయం తీసుకోండి. మీరు ఈరోజు ఏకాంతంలో ఉండాలనుకుంటున్నారు. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు వారిగురించి పూర్తిగా తెలుసుకోండి.