మేషం
ఈ రోజు ఈ రాశివారికి మరింత బాధ్యత పెరుగుతుంది. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేసి అదికారుల నుంచి అభినందనలు అందుకుంటారు.  కొన్ని పనుల కోసం విహారయాత్రకు వెళ్తారు. మీరు మీ దినచర్యలో మార్పులు చేయండి.  స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. పిల్లల వైపునుంచి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభం
నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. రిస్క్ తీసుకోకండి. వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు కొన్ని పనులపై దూరప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు చేపట్టిన పనిలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు.
మిథునం
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పని బాగానే సాగుతుంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను ఎక్కువగా నమ్మొద్దు.  మీ మాటపై సంయమనం పాటించండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  పిల్లలతో సమయం గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన చెందుతారు.


Also Read: బొట్టు పెట్టుకునే అలవాటుందా .. అయితే ఈ వేలితో పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందట…
కర్కాటకం
ఈరోజు ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అసభ్య పదాలు వాడొద్దు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆచరణలో చికాకు ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. బంధువులతో సమావేశమవుతారు.
సింహం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు. పాత మిత్రులను కలుస్తారు. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.  ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య
ఈ రోజు మీకు మంచి సమాచారం అందుతుంది.  ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది.  కుటుంబ సభ్యులను కలుస్తారు.  రోజంతా సంతోషంగా ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ,


Also Read: తీర్థం తీసుకుని చేయి తలకు రాసుకుంటున్నారా…
తుల
బాధ్యతను మించి పనిచేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపై  ఆసక్తి ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చగలుగుతారు. రోజంతా బాగానే ఉంటుంది. అకస్మాత్తుగా బంధువులతో సమావేశమవుతారు. యువత కష్టపడి పనిచేయాలి. నిపుణుల నుంచి సలహాలు, సహాయం అందుతాయి.  ఖర్చులు తగ్గించుకోండి. 
వృశ్చికం
ఈ రోజు మీరు ఒకరి చేతిలో మోసపోతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.  ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి వ్యవహారాల పురోగతి నిదానంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు
ధనుస్సు
కారణం లేకుండా వివాదంలో చిక్కుకుంటారు. మీ కష్టాలు పెరుగుతాయి. ఒత్తిడికి గురవుతారు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లతారు. మీ పని ముందుకు సాగుతుంది. కార్యాలయ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బాధ్యత పెరుగుతుంది. 
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
మకరం
ఈ రాశివారికి ఈ రోజంతా బావుంటుంది.   బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. కార్యాలయ పనుల కారణంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దినచర్య సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
కుంభం
ఈ రోజు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. ఏ పనిని వాయిదా వేయకండి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన పత్రాలను మీతో తీసుకెళ్లండి. ఆదాయ అవకాశాలు ఉంటాయి. రుణ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మీ మాటల మీద సంయమనం పాటించండి. దినచర్యను మార్చుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం
అర్థరాత్రి వరకూ పనిచేయద్దు.  ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. మీరు ఒత్తిడికి గురవుతారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవచ్చు.ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 
Also Read: తిరుప్పావై అంటే ఏంటి, ఆండాళ్ ఎవరు.. గోదాదేవి రాసిన 30 పాశురాల ప్రత్యేకత ఏంటి…
Also Read:  కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
Also Read: జీవితకాలంలో ఈ ఏడు క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకుంటే.. స్వర్గలోకంలోకి ఎంట్రీ ఖాయమట
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే