శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో మీనరాశి ఫలితాలు


మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7


శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మీన రాశివారికి ధనం,సంపదకు కారకుడైన గురుడు జన్మరాశిలో ఉన్నాడు. వ్యయాధిపతి శని 11 వ స్థానంలో , రాహు-కేతువులు 2,4 స్థానాల్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ రాశివారికి ఎలా ఉందంటే...



  • ఆదాయం తక్కువ- ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ధనం ఏదోవిధంగా చేతికందుతుంది

  • మొహమాటానికి పోకుండా ఖర్చులు తగ్గించండి, చేసిన అప్పులు కొంతవరకూ తీర్చగలుగుతారు

  • గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి.

  • మనోధైర్యంతో ముందుకుసాగితే అంతా మంచే జరుగుతుంది

  • ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు

  • దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది, పెద్దల గురించి ఆందోళన చెందుతారు

  • వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం

  • మార్కెటింగ్ రంగంవారు టార్గెట్లు అధిగమిస్తారు

  • న్యాయ, వైద్య, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది

  • తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది.

  • వ్యవసాయంగాల వారికి పంట దిగుబడి బాగున్నా ఆశించిన గిట్టుబాటు ధర లభించదు

  • అకారణంగా మాటలు పడతారు, అపనిందల పాలవుతారు,ఆరోగ్యం అంతగా సహకరించదు

  • శత్రుభీతి ఉంటుంది, నిరుత్సాహం, జీవితంపై విరక్తి కలిగించే సంఘటనలు జరుగుతాయి

  • గృహజీవితంలో ఆనందం ఉంటుంది, కొన్ని సమస్యల విషయంలో రాజీపడడం మంచిది

  • ప్రతి పనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి

  • శని ఏకాదశంలో ఉండడం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది

  • గురు, రాహు, కేతు దోషాల వల్ల తెలియని ఆటంకాలెదురవుతాయి


ఒక్కమాటలో చెప్పాలంటే వీరికి గ్రహబలం అస్సలు లేదు. మీ శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు పెద్దగా పనిచేయవు... మనోధైర్యంతో ముందుకు సాగండి...


నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే


Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.