శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో  తులారాశి ఫలితాలు


తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5


శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తులారాశివారికి గురుడు ఆరవ స్థానంలో, రాహు కేతువులు సప్తమం, జన్మంలోనూ, శని నాలుగో స్థానంలోనూ ఉన్నందున ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి.ముఖ్యంగా అర్థాష్టమ శని ప్రభావం వల్ల గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వలేడు. ఇంకా ఈ ఏడాది తులారాశివారికి ఎలా ఉందంటే...



  • మీరు ఊహించని కొన్ని సంఘటనలతో సమాజంలో గౌరవం పొందుతారు

  • ధైర్యం తక్కువగా ఉండటం వల్ల ప్రతిపనిలోనూ ముందుకు అడుగేయకుండా ఆలోచిస్తారు, కానీ మీ ఆలోచనా విధానం మార్చుకుని ముందడుగువేస్తే విశేష లాభాలుంటాయి
    ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి

  • ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు, మీవల్ల చాలామందికి మేలు జరుగుతుంది , అన్ని వేళలా మిత్రుల సహకారం ఉంటుంది

  • ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతాయి కానీ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు

  • జన్మంలో కేతువు, సప్తమంలో రాహువు ఉండటం వల్ల మనశ్సాంతి ఉండదు

  • కుటుంబంలో కలహాలతో విసిగిపోతారు

  • ఉద్యోగులకు కార్యాలయంలో శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి

  • విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి

  • భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు ...ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలే శ్రేయస్కరం

  • మార్కెట్ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు

  • వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉంటుంది

  • విదేశీయాలకు వెళ్లాలనుకునేవారి కల ఫలిస్తుంది

  • రైతులకు పంట దిగుబడి సంతృప్తినిస్తుంది

  • మీరు చేయాలనుకున్న పనులను వేరేవారికి అప్పగించి ఉండిపోవద్దు, ఏ వ్యవహారంలో ఇతరులను అతిగా విశ్వశించవద్దు

  • ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవటం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం

  • ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి

  • స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి


ఓవరాల్ గా చెప్పాలంటే మీరెంత సమర్థులైనప్పటికీ గ్రహబలం అనుకూలంగా లేదు..దైవబలం కలిసొస్తే విశేష ఫలితాలు సాధించగలుగుతారు                                                                                                     


నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం


Also Read:  2022-2023లో ఈ రాశివారి సక్సెస్ చూసి కొందరు సహించలేరు, ఆ రేంజ్ లో దూసుకెళతారు


Also Read:  శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.