దేశం నలుమూలలా రంగులతో, లేదా రంగు నీళ్లతో మరికొంత మంది పువ్వులతో హోలిని జరుపుకుంటారు. అయితే దేశంలో ఒకే ఒక్క చోట మాత్రం చితా బస్మంతో జరుపుకుంటారు. ఈ వినూత్న వేడుక చూసేందుకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం బారులుతీరుతారు. దీన్నే శ్మశాన హోలీ అంటారు. ఇలా జరుపుకోవడం వల్ల అష్టదరిద్రాలు తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం. దశాబ్దాల క్రితం మొదలైన ఈ వినూత్న హోళి ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది.
కాశీలోని ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్ లో శవభస్మంతో హోలి జరుపుకుంటారు. ఇందుకోసం అప్పుడే దహనం చేసిన శవం భస్మాన్ని తీసుకుని ఒకరి పై ఒకరు చల్లుకుంటూ హోలీ జరుపుకుంటారు. ప్రపంచంలో మరెక్కడా ఇలా జరగదు. ఈ హోలి సమయంలో నాగ సాదువులు పాన్, తో పాటు ఒక రకమైన మత్తును కలిగించే బంగ్ అనే పదార్థాన్ని తప్పక తీసుకుంటారు. వీటిని మహాదేవుని ప్రసాదంగా వారు భావిస్తారు. వేడుకకు ముందు చితికి మంగళహారతి ఇస్తారు. ఆ తర్వాత ఢమరుకాన్ని మోగిస్తారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ ఆ ప్రాంతం మొత్తం మారుమోగిపోయేలా శివయ్యని స్మరిస్తారు.
Also Read: అక్కడ ఐదు రోజుల ముందుగానే హోలీ సంబరాలు
చితా భస్మంతో సంబరాలు మణికర్ణిక ఘాట్ వరకే కాదు...దీన్ని కాశీ విశ్వేశ్వర నాథ దేవాలయంలోకి తీసుకెళతారు. మొదట ఈ భస్మంతో శివుడికి అర్చన చేసి ఆ భస్మాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అంతా పంచుకుంటారు. దేవాలయంలో హారతి తర్వాత హోలీ ఉత్సవం మొదలవుతుంది.
Also Read: ప్రేమ వికసించి కామం దహనమైన రోజు - హోలీ అంటే రంగులు చల్లుకోవడమే అనుకుంటే ఎలా
విశ్వ నాధాష్టకమ్
గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ||