“సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికేశరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే''
ఆశ్వయుజ మాసం పాడ్యమి సెప్టెంబర్ 22 నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు శక్తి స్వరూపిణి తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తుంది. ప్రతి అలంకారానికి ఓ విశిష్టత ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు పూజలు , ఉపవాసాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. అక్టోబర్ 1న నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబరు 2న విజయ దశమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉంటాయి. సూర్యోదయానికి ఉండే తిథి రెండు రోజులు ఉండడంతో నవరాత్రులు దశరాత్రులయ్యాయి. అయితే హిందూ ధర్మంలో నవరాత్రుల రోజులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ సమయంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలతో పాటు కొత్త పనులు , వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు. అయితే నవరాత్రులలో కొత్త ఇంటి పూజ అంటే గృహ ప్రవేశం చేయవచ్చా లేదా?
శారదీయ నవరాత్రులలో గృహ ప్రవేశం చేయొచ్చా?
కొత్త పని ప్రారంభం నుంచి కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వరకు ప్రతి ఒక్కరికీ హిందూ ధర్మంలో శుభ ముహూర్తంపై ఎక్కువ నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా దసరా దశమి రోజు ఏ కార్యక్రమం అయినా తలపెట్టొచ్చు అంటారు. అయితే హిందూ ధర్మంలో చాతుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి శుభ కార్యాలపై నిషేధం ఉంటుంది. ఈ సమయంలో అనేక పనులతో పాటు గృహ ప్రవేశం కూడా నిర్వహించరు. చాతుర్మాసంలో కేవలం పితృదేవతల స్మరణ మాత్రమే చేస్తారు. చాతుర్మాసం ముగిసిన తర్వాత ఈ పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం 2025లో చాతుర్మాసం జూలై 6న ప్రారంభమై నవంబర్ 1న ముగుస్తుంది.
అయితే చాతుర్మాసం మధ్యలో 9 రోజుల పాటు శారదీయ నవరాత్రి పండుగ వస్తుంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజలకు చాలా శుభ దినాలుగా పరిగణిస్తారు. అయితే మీరు గృహ ప్రవేశం కోసం శుభ ముహూర్తం కోసం చూస్తున్నట్లయితే కొన్ని రోజులు ఆగడమే మంచిది.
శారదీయ నవరాత్రులలో గృహ ప్రవేశం కోసం తేదీ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవరాత్రుల రోజులు అన్నీ చాలా శుభప్రదమైనవిగా పరిగణిస్తారు.కానీ గృహ ప్రవేశం గురించి అయితే సెప్టెంబర్ నెలలో గృహ ప్రవేశానికి ఎటువంటి శుభ ముహూర్తం లేదు. కాబట్టి మీరు శారదీయ నవరాత్రులలో గృహ ప్రవేశం చేయలేరు. గృహ ప్రవేశ పూజ కోసం శుభ ముహూర్తం 2025 నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!
నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి