Gold Purchasing Day: హిందూ ధ‌ర్మంలో, ప్రజలు వెండి ఇతర విలువైన లోహాల కంటే బంగారాన్ని అత్యంత పవిత్రమైన లోహంగా భావిస్తారు. ఈ కారణంగా బంగారం కొనుగోలు చేసే ముందు శుభ, అశుభ దినాలు, నక్షత్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది. ఈ కారణంగా ప్రజలు పవిత్రమైన రోజుల్లో బంగారం కొనుగోలు చేస్తారు. మ‌రి బంగారం కొనడానికి ఏ రోజు శుభప్రదమో చూద్దాం.


పవిత్రమైన రోజునే కొత్త వస్తువులు ఎందుకు కొనాలి?


హిందూ సంస్కృతిలో బంగారం మాత్రమే కాకుండా దుస్తులు, పాత్రలు, ఫర్నీచర్, పూజా సామగ్రి మొదలైన అనేక వస్తువులను కొనుగోలు చేసే ముందు శుభ, అశుభ దినాలు, ముహూర్తం త‌దిత‌ర‌ జాగ్రత్తలు తీసుకుంటారు. పవిత్రమైన రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మంచి ఫలితాలు, సంతోషం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయని నమ్ముతారు.


Also Read : స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!


బంగారం కొనడానికి ఏ రోజు ఉత్తమం?


బంగారం కొనడానికి ఏ రోజు శ్రేయస్కరం అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, అక్షయ తృతీయ లేదా ధంతేరస్ వంటి శుభ దినాలలో మాత్రమే కాకుండా మరికొన్ని రోజులలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో బంగారం కొనడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. బంగారం కొనుగోలుకు గురువారం, ఆదివారం అనుకూలమైన రోజులని చెబుతారు. ఈ రోజుల్లో కొనుగోలు చేసిన బంగారం జాతకంలో బృహస్పతి, సూర్యుని స్థానాన్ని బలపరుస్తుంది.


బంగారం కొనడానికి ఈ నక్షత్రం శ్రేయస్కరం


గురువారం, ఆదివారం మినహా పుష్యమి నక్షత్రంతో వారంలో ఏ రోజునైనా కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ నక్షత్రంలో కొనుగోలు చేసిన మంగళకరమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. ఇంటికి సంపదను తెస్తాయి. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే మీ ఇంటికి మరిన్ని ఆభరణాలు వస్తాయి.


ఏ రోజు బంగారం కొనకూడదు?


శనిదేవునికి ప్రీతిక‌ర‌మైన రోజైన శనివారం బంగారు ఆభరణాలు కొనకూడదు. శనివారం బంగారం కొనుగోలు చేయడం వల్ల అది మన ఆర్థిక పరిస్థితిపై చెడు   ప్రభావాన్ని చూపుతుంది. శనివారమే కాకుండా గ్రహణ రోజుల్లో కూడా బంగారం కొనకూడదు.


Also Read : ఇంట్లోని ఈ వస్తువులను అస్సలు ఖాళీగా ఉంచకూడదట, అలా చేస్తే ధన నష్టమే!


బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనేక నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి, వాటిని అనుసరించడం చాలా ముఖ్యం. మనం బంగారం లేదా బంగారు ఆభరణాలను ఒక అశుభ దినం లేదా అననుకూల సమయంలో కొనుగోలు చేస్తే ఆ లోహాలు మన జీవితానికి తీర‌ని అశుభం కలిగిస్తాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.