Ganesh Immersion 2024:  రుతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో ఒకటి వినాయకచవితి. ఏటా భాద్రపద చదివి నుంచి నవరాత్రులు పూజలందుకునే గణపయ్య ఆ తర్వాత నిమజ్జనానికి తరలివెళతాడు..ఇంతకీ నిమజ్జనం ఎందుకు చేయాలి?
 
గణనాథుడి నక్షత్రం హస్త...ఈ నక్షత్రానికి బుధుడు అధిపతి. సాధారణంగా బుధుడికి ఆకుపచ్చనివి అంటే ప్రీతికరం. అందుకే విఘ్నేశ్వరుడికి గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఏక వింశతి పత్రాలు, గరికతో పూజ చేస్తారు. ఇక పూజకు వినియోగించే విగ్రహం ఒండ్రు మట్టితో తయారు చేసి ఉంటుంది. వినాయక విగ్రహాలు తయారుచేసేందుకు అవసరం అయిన ఒండ్రుమట్టి కోసం జలాశయాలలో దిగి పూడిక తీస్తారు. ఈ సందర్భంగా వానలు కురిసేసమయంలో చెవువుల్లో మరింత నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఆ మట్టిని తీసేందుకు జలాశయాల్లో దిగడం.. పూడిక తీయడం, ఆ ఒండ్రు మట్టిలో నానడం వల్ల ఆరోగ్యానికి చాలామంచిది అంటారు ఆరోగ్య నిపుణులు. ఇక వాడవాడలా పూజలందుకునే వినాయకుడు అనంతరం  నిమజ్జనానికి తరలివెళతాడు. 


Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి - వార ఫలాలు ( సెప్టెంబరు 09 - 15)
 
కాలుష్య నివారణకోసమే నిమజ్జనం


వినాయక పూజలో 21 రకాల పత్రి వినియోగిస్తారు. ఇలా 9 రోజులు చేయమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పూజకోసం ఎంచుకునే ప్రతిలు అన్నీ మామూలివి కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులే. అందుకే వ్రతకల్పంలో పొందుపరిచిన పత్రాలతోనే పూజించాలి. ఆయా పత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో వైరల్ , బ్యాక్టీరియాలు నశించి గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఆ తర్వాత ఈ పత్రిలు నీటిలో వేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిలో కలిసి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఫలితంగా నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. 
 
నిమజ్జనం చేయకపోతే ఏమవుతుంది!


సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించిన తర్వాత ... ఎవరికి వీలైనన్ని రోజులు పూజలందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. కొందరైతే విగ్రహాలకు ఉద్వాసన చెప్పేసి పక్కనపెట్టేస్తారు. ఇలా ఉంచేస్తే ఏమీ జరిగిపోదు కానీ ఆ విగ్రహాల పరిమాణాన్ని బట్టి పూజ, నైవేద్యం పాటించాలి. అందుకే నిమజ్జనం చేయాలని చెబుతారు. 
 
నిమజ్జనం చేసేందుకు సరైన ప్రదేశం, చెరువు, కొలనులు లేకపోతే ఏం చేయాలి అనే సందేహం రావొచ్చు. సాధారణంగా ప్రవహించే నీటిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు..ఆ అవకాశం లేకపోయినప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. 



  • పూజకోసం చిన్న విగ్రహాలను వినియోగించడం ద్వారా కరవు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ సులభం అవుతుంది

  • ఉద్వాసన చెప్పేసిన తర్వాత చెరువులు, నదులకే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు..ఇంటి బయట తులసిమొక్క దగ్గర ఓ పాత్రలో నీటిని నింపి అందులో గణేషుడు మునిగేలా దించేయండి...

  • మట్టి మొత్తం కరిగిపోయేవరకూ అలాగే ఉంచేసి ఆ నీటిని చెట్లకు పోయవచ్చు..లేదంటే ..అదే మట్టిలో ఏదైనా మొక్కను నాటొచ్చు..


ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మిక విషయాలతో పాటూ ప్రకృతి పరమైన విశేషాలు కూడా ఉంటాయి. పైగా మండపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యతోపాటూ ఇరుగుపొరుగు వారంతా కలసి సందడిగా తరలివెళతారు. అందరితో ఆడిపాడుతూ బంధాలను పెంచుకునే వేదిక ఇది. అయితే ఈ వేడుకలో హోరు శ్రుతిమించడం, హోదా చూపడం కోసం రంగురంగులి విగ్రహాలను నీటిలో కలపడం చేయకూడదు. గణేష్ పూజ వెనుకున్న ఆంతర్యం కేవలం ప్రకృతి ఆరాధన, ప్రకృతి పరిరక్షణే...


Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!