Rudraksha: హిందూ ధ‌ర్మంలో రుద్రాక్షను పరమేశ్వ‌ర‌ రూపంగా పరిగణించి ధరిస్తారు. ఈ కారణంగా రుద్రాక్షకు మ‌న సంస్కృతిలో గొప్ప స్థానం ఉంది. పౌరాణిక కథనాల ప్రకారం, శివుని కన్నీటి నుండి ఉద్భ‌వించిన‌దే రుద్రాక్ష‌. రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, గ్రహ దోషాల నుంచి విముక్తి క‌లిగి శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. కొందరు రుద్రాక్షను మెడలో, మరికొందరు మణికట్టు వ‌ద్ద‌ ధరిస్తారు.


పవిత్రమైన రుద్రాక్ష‌ను మెడలో ధరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే చాలామంది రుద్రాక్షని ధరించడానికి ఇష్టపడతారు. అయితే భ‌క్తుల న‌మ్మ‌కాన్ని డ‌బ్బు చేసుకునేందుకు కొంద‌రు దుకాణ‌దారులు నకిలీ రుద్రాక్షల‌ను అసలైన రుద్రాక్ష అని విక్ర‌యిస్తున్నారు. మ‌రి అస‌లైన రుద్రాక్ష‌, న‌కిలీ రుద్రాక్షల‌ను ఎలా గుర్తించాలి?


1. అసలైన, నకిలీ రుద్రాక్ష‌


శాస్త్రీయంగా రుద్రాక్షను రెండు రకాలుగా విభజించారు. స్వచ్ఛమైన లేదా నిజమైన రుద్రాక్షని ఇలియోకార్పస్ గానిట్రస్‌గా పేర్కొన్నారు. నకిలీ లేదా భద్రాక్షని ఇలియోకార్పస్ లాకునోసస్ పేరుతో పిలుస్తారు. ఇవి కాకుండా ప్లాస్టిక్ రుద్రాక్షలను కూడా మనం మార్కెట్‌లో చూడవచ్చు. ఈ కారణంగా, రుద్రాక్షను కొనుగోలు చేయ‌డానికి ముందు అది అసలైనదా లేదా నకిలీదా అని సరిగ్గా తనిఖీ చేయాలి. నకిలీ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.


Also Read : రుద్రాక్ష‌లు ఎన్ని ర‌కాలు? ఏ రుద్రాక్ష ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలుంటాయి?


2. అసలైన - నకిలీ రుద్రాక్ష గుర్తింపు


 - మీరు నకిలీ రుద్రాక్షను గుర్తించాల‌నుకుంటున్నారా? ఆవాల నూనెలో కాసేపు ముంచడం ద్వారా అది అస‌లైన‌దో కాదో తెలుసుకోవ‌చ్చు. నిజమైన రుద్రాక్ష దాని రంగును కోల్పోదు. అదే నకిలీ రుద్రాక్షను ఆవనూనెలో వేసి కొంత సేపు ఉంచితే ఖచ్చితంగా రంగు పోతుంది.


 - దీన్ని కనుగొనడానికి మరొక సులభమైన మార్గం ఏమిటంటే, ఒక గ్లాసు నీటిని తీసుకొని అందులో రుద్రాక్షని ఉంచడం. నీటిలో మునిగితే అది నిజమైన రుద్రాక్ష. మరి నీటిపై తేలితే అది నకిలీ రుద్రాక్ష.


- అంతేకాకుండా రుద్రాక్ష పూస ఉపరితల రంధ్రాల ద్వారా అసలైనదా, నకిలీదా గుర్తించవచ్చు. అసలైన రుద్రాక్షకు సహజ రంధ్రాలు ఉంటాయి. నకిలీ రుద్రాక్షకు రంధ్రాలు చేస్తారు. నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి మరొక సులభమైన మార్గం ఏమిటంటే, పదునైన వస్తువును తీసుకొని రుద్రాక్షిపై గీయడం. అప్పుడు రుద్రాక్ష నుండి దారం బయటకు వస్తే, అది నిజమైన రుద్రాక్ష. 


- మ‌రో ప‌రీక్ష ఏంటంటే రెండు రాగి రేకుల మ‌ధ్య రుద్రాక్ష‌ను ఉంచితే వేగంగా తిరుగుతుంది. అదే న‌కిలీది అయితే ఎలాంటి చ‌ల‌నం ఉండ‌దు.


Also Read : ఏ రుద్రాక్ష ధరిస్తే సంపద పెరుగుతుంది, అదృష్టం కలిసొస్తుంది?


అసలైన, నకిలీ రుద్రాక్షల మధ్య తేడాలను తెలుసుకోవడానికి మీరు పైన పేర్కొన్న 5 మార్గాలను ఉపయోగించవచ్చు. రుద్రాక్షి ధరించే ముందు దాన్ని సరిచూసుకుని ధరించండి. మంచి ఫ‌లితాల‌ను పొందండి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.