Priyanka Jain: స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘జానకి కలగనలేదు’ సీరియల్ త్వరలోనే ఎండ్ కార్డ్ పడడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా జానకియే చెప్పేసింది. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పంచుకుంది. అందులో ‘జానకి కలగనలేదు’ ఆఖరి రోజు అంటూ.. ఇక సీరియల్ పూర్తిగా అయిపోతుంది అన్నట్లుగా చెప్పేసింది. అంతేకాకుండా ఈ సీరియల్ లో నటించే నటీనటులతో ఈ సీరియల్ అయిపోతున్నందుకు వారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో అనేది అడిగి తెలుసుకుంది. ఆ వీడియోలు చూసినట్లయితే ప్రతి ఒక్కరు సీరియల్ ని మిస్ అవుతున్నందుకు.. ముఖ్యంగా కో ఆర్టిస్టులను మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా జనాలు షాక్ అవుతున్నారు.


‘జానకి కలగనలేదు’ సీరియల్ స్టార్ మాలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సీరియల్ ప్రారంభం నుండి ఈ సీరియల్ కథకు కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. అత్తింటి గౌరవాన్ని కాపాడే ఒక కోడలిగా జానకి అలియాస్ ప్రియాంక జైన్ అందర్నీ ఫిదా చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సీరియల్ ను అభిమానులు ఏ రోజు కూడా మిస్ చేయకుండా చూశారని చెప్పాలి. ఇక అందులో ఉన్న క్యారెక్టర్స్ కి మాత్రం బాగా అలవాటు పడ్డారు.


ఈ సీరియల్ సమయం అయిందంటే చాలు ఆ సమయం లో ఏ పనులు ఉన్నా కూడా మానేసి మరి సీరియల్ చూస్తున్నారు. ఇక రోజు రోజుకి కూడా కథలోని ఆసక్తి పెంచే విధంగా డైరెక్టర్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఈమధ్య కథలో అంత బలం లేకుండా అనిపిస్తుంది. కథను ఎక్కడికి తీసుకెళ్లాలో డైరెక్టర్ కు అర్థం కానట్లుగా ఉందని చెప్పాలి. మొదటి నుంచి ఇప్పటివరకు కథ ఎన్నో రకాలుగా కొనసాగుతూ వచ్చింది.


మధ్యలో చాలా ట్విస్ట్ లు కూడా పెట్టాడు డైరెక్టర్. ఎప్పటికప్పుడు కథను బాగానే హ్యాండిల్ చేస్తూ వచ్చాడు. కానీ ఈమధ్య కథలో అంత ఆసక్తి కనిపించడం లేదు. చూసే ప్రేక్షకులు కూడా అంతగా ఆసక్తి పెడుతున్నట్లు అనిపించడం లేదు. పైగా రేటింగ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. దీంతో సీరియల్ ను ముగించాలి అని టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


అందుకే జానకి కూడా వీడియో ద్వారా అందరికీ ముందుగానే లీక్ చేసేసింది. నిజానికి జానకి వీడియో ద్వారా చెప్పి తొందరపడిందేమో అని అనిపిస్తుంది. ఇక సీరియల్ ఎప్పుడు ముగుస్తుందో ఎలా ముగుస్తుందో అనేది మాత్రం ఇప్పటికీ తెలియలేదు. పైగా ప్రస్తుతం సీరియల్లో ఒకవైపు వెన్నెల పెళ్లి మరోవైపు ఉగ్రవాదులను పట్టుకునే పనిలో జానకి ఉంది.



కానీ వెన్నెలను పెళ్లి చేసుకోబోయే వ్యక్తియే అసలైన ఉగ్రవాది. మరి వెన్నెల అతడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. జానకి కి కావలసిన మెయిన్ ఉగ్రవాది కూడా అతడే. మరి జానకి అతడు ఉగ్రవాది అని తెలిశాక అతడిని చంపేస్తుందా లేక తన ఆడపడుచు ప్రేమించిన వ్యక్తి అని వదిలేస్తుందా అనేది ఎండింగ్లో తెలుస్తుంది. బహుశా సీరియల్ కి చివరి ఘట్టం అదేనేమో అని అనిపిస్తుంది.


also read it : Trinayani August 17th: 'త్రినయని' సీరియల్ : నయని దంపతులకు భోజనం పెట్టిన విశాలాక్షి, వల్లభ పనికి షాకైన తిలోత్తమా, సుమన?