Trinayani August 17th: 'త్రినయని' సీరియల్ : నయని దంపతులకు భోజనం పెట్టిన విశాలాక్షి, వల్లభ పనికి షాకైన తిలోత్తమా, సుమన?

విశాలాక్షి నయని దంపతులకు మంచి భోజన సమయాన్ని ఏర్పాటు చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.

Continues below advertisement

Trinayani August 17th: నయని గాయత్రి పాపతో గవ్వలు వేయించడంతో నయని గెలుస్తుంది. వెంటనే హాసిని సంతోషంగా అక్కడినుంచి లోపలికి పరిగెత్తుతుంది. ఇక విశాల్ విశాలాక్షి నువ్వు ఓడిపోయావు అని అనటంతో.. నువ్వు ముందే అనుకున్నావు కదా నాన్న అని అనటంతో విశాల్ ఆశ్చర్యపోతాడు. ఇక నయని బాగా ఆడినందుకు అందరు పొగుడుతూ ఉంటారు.

Continues below advertisement

వెంటనే హాసిని చెప్పులు తీసుకొని రావటంతో.. తిలోత్తమా, హాసిని చీదరించుకుంటూ విశాలాక్షికి చెప్పులు తొడుగుతారు. ఇక ఆ చెప్పులను తాకినందుకు సుమన చీదరించుకోవడంతో వెంటనే నయని గుమ్మం అవతల ఉండాల్సిన చెప్పు లోపలికి తెచ్చేలా చేశారు అని అంటుంది. ఇక దురంధర నయని విశాలాక్షిని ఎలా గెలిచిందో అని అనటంతో.. విశాలాక్షి నయని ఆటను పొగుడుతుంది.

ఆటలో తనని చూస్తూ ఉండిపోయాను అన్నట్లు చెబుతుంది. ఇక విశాలాక్షి అమ్మ దయతో గెలిచాను అని అంటుంది. దానితో విశాలాక్షి యుక్తి కంటే భక్తి గొప్పదని గాయత్రి అనేది అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. దాంతో వెంటనే విశాలాక్షి తన భక్తురాలు ఒక ఆవిడ ఉండేది అని కవర్ చేస్తుంది. ఇక వల్లభ నయని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు అనటంతో భోజనం చేశాక చెబుతాను అని అంటుంది.

తర్వాత తిలోత్తమా ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడికి వల్లభ వచ్చి వెటకారంగా మాట్లాడతాడు. విశాలక్షితో ఓడిపోయినందుకు బాధగా ఉంటే.. నయని గెలిచినందుకు కోపంగా ఉంది అని అంటుంది. ఇక భోజనాలు చేద్దామని చెప్పిన ఆ విశాలాక్షికి.. వంటలు వండి అందరితో శభాష్ అనిపించుకునే నయనికి ఒక పరీక్ష పెట్టాలని అని అనుకుంటుంది.

సుమనతో నయనిని తిట్టిపించేలా ఒక ప్లాన్ చేస్తుంది. ఇక విశాలక్షి నయని దంపతులు కలిసి భోజనం చేయమని సలహా ఇస్తుంది. పైన ఉన్న తిలోత్తమా అక్కడ పూల కుండీ పెడుతున్నట్లు చేసి ఆ మట్టిని వారు తినే అన్నంలో పడేసి విశాలాక్షిని ఇరికించాలని చూస్తుంది. వెంటనే వల్లభ నేను ఇక్కడ ఉండి ఆ పని చేస్తాను మీరు వెళ్ళండి అనడంతో వాళ్ళు కిందికి వస్తారు. ఇక విశాలాక్షి శివయ్య గురించి మాట్లాడుతూ ఉండగా బాయ్ ఫ్రెండ్ ఏమో అని కాసేపు సుమన రచ్చ చేస్తుంది.

ఆ తర్వాత విశాలాక్షి నయని దంపతులకు భోజనం వడ్డిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. వల్లభ పైన పూల కుండీ ఏర్పాటు చేస్తాడు. ఇక విశాలాక్షి భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఆకులో తినాలి అని.. లేదా భర్త తిన్న తర్వాత భార్య తినాలి అని అంటుంది. అప్పుడే విక్రాంత్ మేమెప్పుడు విడివిడి గానే తింటాం అని అంటాడు. దాంతో విశాలాక్షి విడివిడి ఆకులను విడాకులు అని అంటారు అనటంతో అందరూ షాక్ అవుతారు.

వెంటనే హాసిని మీరు విడాకులు తీసుకుంటారా చిట్టి అని అడగటంతో ఎందుకు అలా అంటావు అక్క అని సుమన అంటుంది. ఇక విశాలాక్షి మాటలకు తిలోత్తమా వెటకారం చేసి మాట్లాడటంతో వెంటనే హాసిని తిలోత్తమా కు కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత నయని దంపతులు ఒకరికొకరు తినిపించుకుంటారు. ఇక పైనున్న వల్లభ మట్టి పోస్తూ ఉండటంతో విశాలాక్షి దానిని మధ్యలోనే ఆపి వేస్తుంది.

అది చూసి తిలోత్తమా, వల్లభ, సుమన షాక్ అవుతారు. ఇక విశాల్ భోజనం అద్భుతంగా ఉంది అని నయని తినిపించినందుకు రుచిగా ఉంది అని పొగుడుతూ ఉంటాడు. హాసిని తన భర్త ఉన్నాడు ఎప్పుడు తినిపించలేదు అంటూ ఆయనపై వెటకారం చేస్తూ అరుస్తుంది.

 

also read it : Trinayani August 16th: విశాలాక్షి చావును కోరుకున్న సుమన.. నయనిని గెలిపించిన గాయత్రి పాప?

 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola