ఫెంగ్ ష్యూయి అనేది చైనీయుల పురాతనమైన శాస్త్రపరిజ్ఞానం. పెళ్లిల్ల సీజన్ వచ్చినప్పుడు నవదంపతులకు ఏం బహుకరిస్తే బాగుంటుందనే విషయంపై చాలా ఆలోచిస్తుంటారు. సరికొత్తగా, అందంగా, ఆకర్శణీయంగా ఉండడంతో పాటు ఉపయోగకరంగా ఉండే బహుమతి ఇవ్వాలనే అందరూ అనుకుంటారు. ఇలాంటి ఆలోచన ఉన్నపుడు కొన్ని ఫెంగ్ ష్యూయి వస్తువులు కొత్త జంటకు బహుకరించేందుకు చాలా అనుకూలమైనవి. కొత్త జీవితం ప్రారంభిస్తున్న నవదంపతులకు అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ ఫెంగ్ ష్యూయి వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
క్రిస్టల్ లోటస్
ఫెంగ్ ష్యూయిని అనుసరించి క్రిస్టల్స్ సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. లోటస్ శుభ్రతకు, స్వచ్ఛతకు ప్రతిరూపం ఈ రెండూ కలిసి ఉన్నపుడు ఆనందం, శృంగారానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రిస్టల్ లోటస్ ను కిటికీ దగ్గరగా సూర్య రశ్మి నేరుగా పడేవిధంగా ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఇంట్లో నైరుతి దిశలో అలంకరించుకుంటే బావుంటుంది. ఎక్కువ రేకులు ఉండే క్రిస్టల్ లోటస్ ఎంపిక చేసుకుంటే మంచిది.
మాండరీన్ డక్స్
మాండరీన్ డక్స్ ప్రేమ సంకేతాలుగా ప్రాచూర్యంలో ఉంటాయి. నూతన దంపతులకు మంచి గిఫ్ట్ కూడా. ఆనందకర దాంపత్యాన్ని కలిగించాలని ఆశిస్తూ ఇవ్వవచ్చు. ఈ పక్షుల జంటను ఇవ్వడం చాలా మంచిది.
ఫెంగ్ ష్యూయి క్రిస్టల్స్
బహుముఖాలు కలిగిన క్రిస్టల్స్ పరిసరాల్లో శక్తి విస్తరిస్తుంది. చెక్కతో చేసిన ప్లాట్ ఫాం మీద దీన్ని ఉంచినపుడు వచ్చే లైట్ రిఫ్లక్షన్ వల్ల జీవశక్తి వ్యాపించి ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్టల్స్ ఎర్త్ ఎనర్జీకి సంకేతాలు. ఇవి ఉన్న చోట సంతోషం, సంపద పెరుగుతాయి. విజయాలు సొంతమవుతాయి. ఆగ్నేయంలో ఈ క్రిస్టల్స్ ఉంచినపుడు ప్రేమను ఆకర్షిస్తాయి.
క్వాన్ యిన్ గాడెస్
ఫెంగ్ ష్యూయిలో క్వాన్ యిన్ ముఖ్యమైన దేవత. ఈమె చేతిలో లోటస్ లేదా నీళ్లు పోస్తున్న కుండ ఉంటుంది. ఈ దేవత శక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ దేవత శిల్సాన్ని నవదంపతులకు బహుకరిస్తే అది వారి అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది పడక గదిలో పెట్టుకుంటే దంపతుల మధ్య తగాదాలు రావని నమ్ముతారు. కనుక వారి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది.
ఏనుగు బొమ్మలు
ఫెంగ్ ష్యూయిలో ఏనుగు బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తొండం పైకి ఎత్తినట్టు ఉన్న ఏనుగు బొమ్మ సంపదను ఆకర్షిస్తుంది. ఏనుగులు సంపదకు, శక్తికి, సంతానానికి ప్రతీకలు. నవదంపతులు ఆనందకర జీవితాన్ని ఆశిస్తూ వారికి ఏనుగు బొమ్మలను బహుకరించవచ్చు. వీటిని ఇంట్లో కాస్త ఎత్తు మీద ఉన్న షెల్ఫ్ లో అలంకరించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Also Read : Friends in Dreams: కలలో స్నేహితులు కనిపిస్తే శుభమా? అశుభమా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.