SRH vs PBKS Preview and Prediction : మూడు సంవత్సరాల తర్వాత తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)... పాయింట్ల పట్టికలో రెండో స్థానంపై కన్నేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS)తో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరాలని హైదరాబాద్ పట్టుదలగా ఉంది. మరోవైపు పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉన్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో గెలిచి విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని భావిస్తుంది. ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు సిద్ధం కావాలని హైదరాబాద్ చూస్తోంది.
బ్యాటింగే బలం
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బ్యాటింగ్ ప్రధాన బలంగా ఉంది. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఈ సీజన్‌లో విజయాలు సాధించిన సన్‌రైజర్స్...మరోసారి అదే విధానాన్ని కొనసాగించాలని చూస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరింది. ఇప్పటివరకూ మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధిస్తే హైదరాబాద్ ఖాతాలో 17 పాయింట్లు ఉంటాయి. కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే హైదరాబాద్ రెండో స్థానానికి ఎగబాకుతుంది. అలాకాకుండా కోల్‌కత్తాపై రాజస్థాన్ గెలిస్తే రాజస్థాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంటుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లే ప్రధాన బలంగా ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు దాడితో ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి విధ్వంసంతో హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 160కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ట్రానిస్ హెడ్ 11 మ్యాచ్‌ల్లో 533 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 661 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 583 పరుగుల తర్వాత హెడ్ మాత్రమే ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ నిలకడ లేమి హైదరాబాద్‌ను వేధిస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపిస్తున్నాడు. SRH బౌలర్లు కూడా పర్వాలేదనిపిస్తున్నారు.
పంజాబ్ ఏం చేస్తుందో
ఇప్పటికే ఓటములతో సతమతమవుతున్న పంజాబ్‌కు కెప్టెన్ శామ్ కుర్రాన్‌తో సహా ఇంగ్లండ్ ఆటగాళ్లు అందరూ దూరమయ్యారు. జాతీయ జట్టుకు ఆడేందుకు శామ్ కరణ్ స్వదేశానికి వెళ్లాడు. జితేష్ శర్మ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తాడు. ఈ పరిస్థితుల్లో పంజాబ్... హైదరాబాద్ దాటికి తట్టుకుంటుందా అన్నది చూడాలి.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
పంజాబ్ కింగ్స్: మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (కెప్టెన్), సికందర్ రజా, రిషి ధావన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసోవ్.