Dussehra 2023: హిందూ ధర్మంలో జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన నవరాత్రి . భారతదేశంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుకొనే ప్రధాన పండుగలలో నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యమైన స్థానం ఉంది. ఉత్సవాల తొమ్మిది రోజులలో, భక్తులు అమ్మవారి ప్రతి అవతారాన్ని సంప్రదాయం ప్రకారం భక్తిప్రపత్తులతో పూజిస్తారు. అమ్మవారికి శాస్త్రప్రకారం పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. 9 రోజులలో ఇంట్లో లేదా దేవాలయంలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తుంటారు. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అందుకే నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవికి నూనె దీపం వెలిగించాలా..? లేక నెయ్యి దీపం వెలిగించాలా.?
Also Read : దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
1. దుర్గాదేవి ముందు ఏ దీపం వెలిగించాలి
శాస్త్రం ప్రకారం, నవరాత్రులలో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. కావాలంటే నువ్వుల నూనెతోనూ దీపం వెలిగించవచ్చు. మీరు దేవుడికి ఏ నూనెతో వెలిగించినా, విగ్రహానికి ఏ వైపున ఏ నూనె దీపం వెలిగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నువ్వుల దీపం వెలిగిస్తే అమ్మవారి ఎడమ వైపు అంటే మీ కుడి వైపున వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. దుర్గామాత అనుగ్రహం మీపై ఎల్లప్పుడు ఉంటుందని విశ్వసిస్తారు.
2. నవరాత్రి దీపం వెలిగించేటప్పుడు వీటిని గుర్తుంచుకోండి
దీపం వెలిగించేటప్పుడు, నెయ్యి దీపానికి తెలుపు నిలువు వత్తి, నువ్వుల దీపానికి ఎరుపు నిలువు వత్తి ఉండాలని గుర్తుంచుకోండి. దీపం శుభ్రంగా ఉండాలి. మరి ఆ దీపం ఎక్కడా పగిలిపోకూడదు. ఎందుకంటే పూజలో మురికిగా ఉన్న లేదా విరిగిన దీపాలను వెలిగించడం మనకు అశుభం.
3. నవరాత్రి దీపం ఏ దిక్కున పెట్టాలి
శాస్త్రం ప్రకారం, దీపాన్ని ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో అంటే తూర్పు-దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రంలో ఈ దిశ చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు ఈసారి దుర్గాదేవికి దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగించడానికి ఈ దిశను ఎంచుకోండి.
Also Read : నవరాత్రి ఉత్సవాల్లో నవదుర్గలకు ఏ రోజు ఏ రంగు వస్త్రాలు, పూలు సమర్పించాలి
నవరాత్రి ఉత్సవాల్లో మీరు అమ్మవారికి దీపం వెలిగించినప్పుడు, దీపం వెలిగించేటప్పుడు పై విషయాలను గుర్తుంచుకోవాలి. అప్పుడే అమ్మవారికి దీపం వెలిగించిన ప్రయోజనం కలుగుతుంది.
దశవిధాలైన పాపాలను హరించేది కనుకే ‘దశహరా’ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచి ప్రారంభమయ్యాయి.... అక్టోబరు 24 వరకూ జరగనున్నాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.