మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని శుభకరమైనవి ఉంటాయి. అశుభకరమైనవి ఉంటాయి. మంచి కలలు వచ్చినప్పుడు ఏమి అనిపించదు. చెడ్డ కలలు వచ్చినప్పుడు భయంగా అనిపిస్తుంటుంది. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం.. మనకు వచ్చే కొన్ని కలలు నిజమవుతాయట. ప్రతి రాత్రి ఏదొక కల వస్తూనే ఉంటుంది. వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మరి కొన్నింటిని పూర్తిగా మరచిపోతాం. కానీ కొన్ని కలలు సంతోషంగా ఉంటే మరికొన్ని భయానకంగా ఉంటాయి. అంతే కాకుండా స్వప్న శాస్త్రం ప్రకారం బ్రహ్మముహూర్తం సమయంలో వచ్చే కలలు  ఖచ్చితంగా నిజమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కలలు ఏవి నిజమవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.


పన్ను ఊడిపోవడం 


స్వప్న శాస్త్రం ప్రకారం.. మీకు కలలో విరిగిన పన్ను కనిపిస్తే శుభ సూచకం. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్‌తో పాటు శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీ మనసులో ఏ కోరిక ఉన్నా.. అది  నెరవేరుతుందట. 


పసి పిల్లాడి నవ్వు..


బ్రహ్మ ముహూర్త సమయంలో వచ్చిన కలలో నవ్వుతున్న పిల్లవాడు కనిపిస్తే, ఆ వ్యక్తికి శుభం కలుగుతుంది. నిజానికి, ఈ కల ఆర్థిక లాభాలను కూడా సూచిస్తుంది. ఈ వ్యక్తిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. 


కుండ


బ్రహ్మ ముహూర్త సమయంలో కలలో కలశం లేదా నీటితో నిండిన కుండను చూస్తే, వారికీ మంచి రోజులు రానున్నాయని అర్థం. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి. అలాగే, ఈ సమయంలో వచ్చిన మనీలో కొంత డబ్బును డొనేట్ చేస్తారు. 


నదిలో స్నానం..


బ్రహ్మ ముహూర్తంలో ఎవరైనా నదిలో స్నానం చేస్తున్నట్టు కల వచ్చినట్లయితే, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ అతి త్వరలో పూర్తవుతాయని అర్థం. కలల శాస్త్రం ప్రకారం, అలాంటి కలలు ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి తిరిగి వస్తుంది. ఈ సమయంలో ఎక్కడా  డబ్బు పెట్టుబడి పెట్టినా, రెండింతలు తిరిగి వస్తుంది. 


చంద్రుడు కనిపిస్తే.. 


చంద్రుడు చల్లదనానికి, శాంతికి సంకేతమని మనందరికీ తెలుసు. కలలో చంద్రుడు రావడమంటే మాములు విషయం కాదు. చందమామ వచ్చిన తర్వాత రోజు నుంచి వారి జీవితం మొత్తం మారిపోతుంది. కష్టాలు కూడా మిమ్మల్ని చూసి పారిపోతాయి. అప్పటి వరకు ఉన్న బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఇక ఎటువంటి సమస్యలు లేకుండా స్థిరంగా, సాఫీగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు క్రమపద్ధతిలో జరుగుతాయని తెలుసుకోండి. అంతే కాకుండా కుటుంబంలో గొడవలు, విబేధాలు లేకుండా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.


Also Read: మీరు పెళ్లిచేసుకునేముందు ఇవన్నీ ఆలోచించారా - పెళ్లి గురించి చాణక్యుడు చెప్పిన ఆసక్తికర విషయాలివే!


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.