మనిషి సంఘజీవి. చాలా సందర్భాల్లో పండుగలు, ఉత్సావాలకు పదిమంది సన్నిహితులను ఇంటికి పిలుస్తారు లేదా వారి ఇంటికి వెళ్తారు. అందరితో కలిసి భోజనాలు చేస్తుంటారు. ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలు చెయ్యడం జీవన గమనంలో భాగం. ఆహారం కేవలం ఆహారంగా మాత్రమే కాదు సంస్కృతిలో కూడా భాగమే. కనుక ధర్మ శాస్త్రాలలో వంట తయారుచేసే స్థాయి నుంచి వడ్డన, ఆహారం తీసుకునే వరకు అన్ని విషయాలకు కొన్ని ప్రత్యేక నియమాలు మన పురాణంలో ఉన్నాయి. ముఖ్యంగా గరుడ పురాణంలో ఏం చెప్పారో చూద్దాం.


ఇక్కడ భోంచెయ్యొద్దు


గరుడ పురాణంలో కొంత మంది ఇంట్లో భోజనం చేయొద్దని అని చెప్పారు. ఎందుకంటే ఆహారం ద్వారా శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం ప్రభావం మనసు మీద కూడా నేరుగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనతో చేసిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. ప్రతికూల వాతావరణంలో కూర్చుని ఎప్పుడూ ఆహారం తీసుకోకూడదు.


దొంగ లేదా నేరస్తుల ఇళ్లు


దొంగలు లేదా ఏదైనా నేరం చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ భోంచెయ్యకూడదు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెచ్చిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ ఆహారం శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పాపం లేదా నేరం వల్ల వచ్చిన సొమ్ముతో వచ్చిన ఆహారం తీసుకోవడం వల్ల ఆ పాపంలో భాగం తీసుకున్నట్టు అవుతుంది. అటువంటి ఆహారం తీసుకోవడం మీ తెలివి తేటలను ప్రభావితం చేసి వాటిని పాడు చేసే ప్రమాదం ఉంటుంది.


నపుంసకుల ఇంట్లో


నపుంసకులకు దానం చెయ్యడం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే వారికి పెట్టాలి కానీ వారి చేత తినకూడదనే నియమం ఉంది. కనుక నపుంసకులు ఇచ్చే భోజనం తినకూడదు. అయితే, వీరిని గుర్తించడం కష్టమే.


కోపంతో ఉన్న వ్యక్తి ఇంట్లో


ఎప్పుడూ కోపంతో ఉండే వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ భోజనం చెయ్యకూడదు. అతని కోప స్వభావం వల్ల ఆ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. అది ఇంటి వాతావరణాన్ని అక్కడ తయారైయ్యే భోజనాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కనుక అక్కడ వాళ్లు వడ్డించే భోజనం తినడం మంచిదికాదు. అలాంటి వారి సాంగత్యం కూడా మంచిది కాదు.


కలుషిత ప్రదేశం


దుమ్ము ధూళీ చేరిన ప్రదేశంలో, ఇన్ఫెక్సన్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అటువంటి చోట ఆహారం ఎప్పుడూ తినకూడదు. హాస్పిటల్ చుట్టూ ఉన్న చోట తినకూడదు. రోగి దగ్గర కూడా ఆహారం తీసుకోవద్దు.


వ్యసనపరుల ఇంట్లో


మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వారింట్లో భోంచెయ్యకూడదు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి డబ్బు సంపాదిస్తారు. దాని వల్ల వారింటి ఆహారం మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. అలాంటి వారి ఇంట్లో నీళ్లు తాగడం కూడా మంచిదికాదు.


Also read : శ్రావణ సోమవారం నాడు ఈ రాశి వారు ఇలాంటి పరిహారాలు చేస్తే తిరుగుండదు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial