Wednesday Donts: హిందూ సంప్రదాయంలో బుధవారం గణపతి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజున గణనాథుడిని పూజించడం వల్ల వ్యక్తి జాతకంలో ఉన్న బుధ దోషాలు తొలగిపోతాయి. ఆ వ్యక్తి తన జీవితంలో పదునైన మేధస్సు, జ్ఞానం, పురోగతితో పాటు ఆరోగ్యాన్ని పొందుతాడు. మీ మనస్సు సరైన దిశలో పనిచేయాలని, జీవితంలో ముందుకు సాగాలని, పురోగతి సాధించాలని , ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే, బుధవారం కొన్ని తప్పులు చేయకండి. బుధవారాల్లో మనం తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు మన జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బుధవారం నాడు మనం చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?
Also Read : బుధవారం ఇలా చేస్తే కెరీర్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు
1.రుణం
మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, కొన్నిసార్లు మనకు డబ్బు సమస్యలు ఎదురవుతాయి. మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు, ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా బుధవారాల్లో డబ్బు లావాదేవీలు చేయకూడదు. బుధవారం పని కోసం పవిత్రమైన రోజుగా చెప్పినప్పటికీ, ఈ రోజు డబ్బు వ్యవహారాలకు శ్రేయస్కరం కాదు. మీరు బుధవారం ఎవరికైనా డబ్బు ఇస్తే, ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందని అనుకోకండి. మీరు బుధవారం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్నట్లయితే, దాన్ని తిరిగి చెల్లించడానికి మీరు 100 రెట్లు ఎక్కువ కష్టపడవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫలితంగా, మీ రుణం తగ్గడానికి బదులుగా పెరుగుతుంది.
2. సంబంధాల్లో ఉద్రిక్తత
రంగులు సంబంధాలతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. మీరు ప్రేమ - సంబంధంతో ముడిపడి ఉన్న రంగు గురించి మాట్లాడినట్లయితే, ఎరుపు రంగు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కానీ, నలుపు రంగును సంబంధాలకు శత్రువుగా పరిగణిస్తారు. బుధవారం రోజు భార్యాభర్తలు నలుపు రంగు దుస్తులు ధరించరాదని శాస్త్రంలో పేర్కొన్నారు. దీంతో భార్యాభర్తల మధ్య టెన్షన్ ఏర్పడి ఒకరితో ఒకరు సంతోషంగా ఉండలేకపోతారని తెలిపారు.
3. ఆర్థిక సంక్షోభానికి కారణం
ఎవరికైనా డబ్బు పెద్ద సమస్య. అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు ప్రజలు నియంత్రణ కోల్పోతారు. మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఉంటే, మీరు నియంత్రణలో ఉంటారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ అంటే డబ్బున్నప్పుడు, డబ్బు లేనప్పుడు డబ్బును గౌరవించడం అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సాధారణ వ్యక్తి అయినా డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఇంట్లోని మహిళలను, చుట్టుపక్కల స్త్రీలను గౌరవించే వారి పట్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఎవరి ఇంట్లోని స్త్రీ గౌరవానికి దూరమవుతుందో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. అలాంటి వారిని ఎప్పుడూ ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఈ కారణంగా బుధవారం మీ ఇంట్లోని స్త్రీల పట్ల లేదా మీ చుట్టుపక్కల స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించకండి.
Also Read : మీరు గణపతి భక్తులా - బుధవారం ఉపవాసం చేసే విధానం, విశిష్టత, జపించాల్సిన మంత్రం ఇదే
ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో బుధ గ్రహం మన ఆనందానికి సంబంధించినది. ఈ గ్రహం మనకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా మన పురోగతికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బుధవారం నాడు క్రమం తప్పకుండా వినాయకుడిని పూజించాలి. స్త్రీలను గౌరవించాలి. అలా చేసేవారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.