Wednesday Tips: హిందూ మత విశ్వాసాల ప్రకారం, వారంలో నాలుగో రోజు బుధవారం, ప‌ర‌మేశ్వ‌రుడి కుమారుడైన గణ‌ప‌తికి అంకితం చేశారు. ఈ రోజు వినాయ‌కుడిని పూజించ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది. హిందూమతంలో, గణ‌ప‌తికి ప్ర‌థ‌మ పూజ చేయాల‌నే నియ‌మం ఉంది. ఏ ప‌ని మొద‌లుపెట్ట‌డానికి కైనా లేదా శుభకార్యాలు ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తారు. బుధవారం నాడు గణపతి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, అన్ని పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుందని భ‌క్తుల‌ విశ్వాసం.


గణేశుడిని బుద్ధి ప్ర‌సాదించే దేవుడు అని కూడా అంటారు. ఈ కారణంగా పరీక్షలు లేదా వృత్తిలో విజయం కోసం గణ‌ప‌తిని పూజిస్తారు. ఇది కాకుండా, బుధవారం కొన్ని చర్యలు తీసుకుంటే, వృత్తి జీవితంలో ఎదుర‌య్యే అడ్డంకులు క్షణాల్లో తొలగిపోతాయి. వృత్తి జీవితంలో సమస్యలు తొలగాలంటే బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి.


Also Read : చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటి - నియమాలేంటి - ఎవరైనా చేయొచ్చా!


1. బుధవారం ఈ వస్తువులను దానం చేయండి
మీరు మీ కెరీర్‌లో విజయం సాధించాలనుకుంటే, బుధవారం కొన్ని వస్తువులను దానం చేయడం ప్రయోజనకరమ‌ని పేర్కొన్న‌రాఉ. శాస్త్రం ప్రకారం, బుధవారం నాడు అవసరమైన వారికి పచ్చి వస్తువులను దానం చేయండి. అంతేకాకుండా పచ్చని వస్త్రాలను దానం చేయవచ్చు. ఈ రోజు వివాహిత స్త్రీకి పచ్చని గాజులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని దానం చేయడం వల్ల కెరీర్‌లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి విజయానికి బాటలు ప‌డ‌తాయి.


2. గణేశ మంత్రాన్ని జపించండి
శాస్త్ర ప్రకారం, మీరు గణేశుడి అనుగ్రహం పొందాలంటే, బుధవారం నాడు నియ‌మ‌, నిష్ఠ‌ల‌తో వినాయకుడిని పూజించాలి. పూజ సమయంలో 'ఓం గ్లౌం గణపత్యే నమః' అనే మంత్రాన్ని జపించాలి. మీ వృత్తి జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని, గణేశుడి అనుగ్రహం మీపై శాశ్వతంగా ఉంటుందని నమ్మ‌కంతో ఉండాలి.


3. ఆభరణాలు ధరించడం
కొన్నిసార్లు బుధ దోషం కారణంగా ఒక వ్యక్తి తన కెరీర్‌లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటాడు. మీకు కూడా బుధ దోషం ఉందని ఖచ్చితంగా తెలిస్తే వెంటనే బుధవారం బంగారు ఆభరణాలు ధరించడం మంచిది. బుధవారం బంగారు ఆభరణాలు ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది కాకుండా, బుధగ్రహం దుష్ప్రభావాలను తగ్గించడానికి ఇంటికి తూర్పు దిశలో ఎరుపు రంగు జెండాను ఉంచాలి.


Also Read : బోనాలు ఆషాడమాసంలోనే ఎందుకు చేస్తారు


బుధవారం నాడు ఈ ప‌నులు చేస్తే వృత్తి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. మీకు బుధ దోషం ఉన్నప్పటికీ, అది కూడా తొలగిపోతుంది. ఈ పై పనులు చాలా సులువుగా ఉన్నందున ఎవరైనా వీటిని ఆచ‌రించి ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.