Diwali Lakshmi Puja Time 2025: ఈ సంవత్సరం దీపావళి తేదీ గురించి కొంత అయోమయం ఉంది. కొంతమంది అక్టోబర్ 20న పూజలు చేయాలని భావిస్తుంటే, మరికొందరు అక్టోబర్ 21న పూజలు చేయాలంటున్నారు. అయితే శాస్త్రాలు , పంచాంగం ఆధారంగా చూస్తే సరైన తేదీపై ఓ స్పష్టత వచ్చేస్తుంది. 

Continues below advertisement

2025లో ఆశ్వయుజ అమావాస్య  రెండు రోజుల పాటు ఉంటుంది. 

దీపావళి పూజ తేదీని నిర్ణయించడానికి శాస్త్రీయ నియమం ఏంటంటే...

Continues below advertisement

'ప్రదోష వ్యాపిని అమావాస్య'

దీని అర్థం ఏంటంటే, సూర్యాస్తమయం తర్వాత (ప్రదోష కాలంలో) అమావాస్య తిథి ఉన్న రోజు రాత్రి లక్ష్మీ పూజ చేయాలి. శాస్త్రాల్లో ప్రదోష కాలాన్ని లక్ష్మీ పూజకు అత్యంత ముఖ్యమైన సమయంగా భావిస్తారు.

ధర్మసింధులో ఇలా ఉంది

అథాశ్వినామావాస్యాయాంప్రాతరభ్యంగః ప్రదోషేదీపదానలక్ష్మీపూజనాదివిహితం॥

ఆశ్వయుజ మాసం  అమావాస్య రోజు ఉదయం అభ్యంగ స్నానం .. ప్రదోష కాలంలో దీపదానం లక్ష్మీ పూజ చేయాలి. 

 2025 పంచాంగం ప్రకారం..

అక్టోబర్ సోమవారం సూర్యాస్తమయం దాదాపు 5:42 గంటలకు  ప్రదోష కాలం ప్రారంభం: 5:42 గంటలకు  అమావాస్య తిథి ప్రారంభం: మధ్యాహ్నం 2:40 గంటలకు

ఈ రోజున ప్రదోష కాలం ప్రారంభం నుంచి రాత్రి అంతా అమావాస్య తిథి పూర్తిగా ఉంటుంది. ఇది లక్ష్మీ పూజకు అత్యంత అనుకూలమైన ..శాస్త్రాల ప్రకారం సరైన సమయం.

అక్టోబర్ 21 మంగళవారం సూర్యాస్తమయం: దాదాపు 5:41 గంటలకు ప్రదోష కాలం ప్రారంభం: 5:41 గంటలకుఅమావాస్య తిథి ముగింపు: 4:05 గంటలకు

ఈ రోజున ప్రదోష కాలంలో అమావాస్య ఘడియలు లేవు. అందుకే ఈ సమయంలో లక్ష్మీపూజ చేయరు. నిత్యం దీపం వెలిగించే అలవాటున్నవారు  దేవుడి వద్ద దీపం వెలిగించుకోవచ్చు... ఇంటి బయట దీపాలు పెట్టుకోవచ్చు. కానీ దీపావళి సందర్భంగా చేసే లక్ష్మీపూజకు ఈ సమయం సరికాదు. ధర్మసింధు నియమం కూడా ఇదే చెబుతోంది:

“పూర్వత్రైవ ప్రదోషవ్యాప్తౌ లక్ష్మీపూజాదౌ పూర్వా, అభ్యంగస్నానాదౌ పరా.”

"మొదటి రోజున ప్రదోష కాలంలో అమావాస్య ఉంటే, లక్ష్మీ పూజను అదే రోజున చేయాలి. అభ్యంగ స్నానం మరుసటి రోజున చేయవచ్చు.  అక్టోబర్ 20న ప్రదోష కాలంలో అమావాస్య పూర్తిగా ఉంది, అయితే అక్టోబర్ 21న ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్మీ పూజను అక్టోబర్ 20న చేయాలి.

పంచాంగం  శాస్త్రాల ప్రకారందీపావళి ప్రధాన లక్ష్మీ-గణేశ పూజ, దీపదానం ఆరాధన అక్టోబర్ 20, 2025, సోమవారం సాయంత్రం చేయాలిఅక్టోబర్ 21న అభ్యంగ స్నానం, దానధర్మాలు చేయడం ఉత్తమం.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

2025లో ధన త్రయోదశి , నరక చతుర్థశి, దీపావళి...ఏ రోజు ఏ పండుగ, ఏం చేయాలి, విశిష్టత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

దీపావళి రోజు అర్థరాత్రి కాళీ పూజ! శుభ ముహూర్తం, పూజా విధానం, నైవేద్యం, మంత్రాలు, విశిష్టత తెలుసుకోండి!