Diwali 2025 Complete Calendar: చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకుడు అనే రాక్షసుడు తాను తల్లి చేతిలో మాత్రమే మరణించాలనే వరాన్ని పొందుతాడు. ఆ వర గర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెడతాడు. దేవతలు, గంధర్వులు, మునులు అంతా శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. స్పందించిన శ్రీమహావిష్ణువు...ద్వారపయుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుల సంహాం చేస్తాడు. చతుర్థశి రోజు నరకుడు మరణించగా..ఆ తర్వాత రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణాసురుడిని హతమార్చి లంక నుంచి రాముడు అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని మరో కథనం. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటూ జరుపుకుంటారు.
మొదటి రోజు ధన త్రయోదశి ( Dhanteras 2025) - అక్టోబర్ 18 శనివారం
ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజే ధన త్రయోదశి. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. బంగారం, వెండి కొనుగోలు చేయడం ఈ రోజు శుభప్రదంగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఇదే అని చెబుతారు. ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించారు.ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు.
రెండో రోజు నరక చతుర్దశి (Naraka Chathurdasi 2025) - అక్టోబర్ 19 ఆదివారం ఆశ్వయుజ బహుళ చతుర్థశి నరక చతుర్థశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట. ఈ రోజు నువ్వుల నూనె రాసుకుని.. తలకు స్నానం ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
మూడో రోజు దీపావళి అమావాస్య (Diwali 2025) - అక్టోబర్ 20 సోమవారం
ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగులతో ఇంటిని నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీపూజ ఆచరిస్తారు
నాలుగో రోజు బలి పాడ్యమి (Balipratipada 2025) - అక్టోబర్ 21 మంగళవారం దీపావళి మరుసటి రోజు..కార్తీక మాసం మొదటి రోజు వచ్చే పాడ్యమిని బలిపాడ్యమి అంటారు. చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకు వచ్చిన రోజు ఇది అందుకే బలిపాడ్యమి అంటారు. ఈ రోజు మహారాష్ట్ర నవదివస్ జరుపుకుంటారు. గుజరాతీలకు ఈ రోజు ఉగాది. శ్రీ కృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఈ రోజే. ఐదో రోజు యమ విదియ (Yama Dwitiya 2025) - అక్టోబర్ 22 బుధవారం
కార్తీకమాసంలో రెండో రోజున యమవిదియ జరుపుకుంటారు.దీనిని పురాణాల్లో రాఖీ పండుగ అనొచ్చు. ఈ రోజు సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు, భోజనం తర్వాత వస్త్రాలు కానుకలు సమర్పస్తారు సోదరీమణులు. సూర్యుడి కుమారుడు యముడు, ఆయన సోదరి యమున.. ఆమెకు అన్నయ్య అంటే ఎంతో ఆప్యాయత. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా రాని యముడు..కార్తీకమాసం విదయ రోజు అనుకోకుండా వెళతాడు. సంతోషించిన యమున ఘనంగా ఆహ్వానిస్తుంది. సంతోషించిన సోదరుడు యముడు ఏదైనా వరం కోరుకోమని చెప్పగా.. ఏటా ఇదే రోజు ఇంటికి విందుకు రావాలని కోరుతుంది. అలా ఇది యమవిదిగా, భగనీహస్త భోజనంగా స్థిరపడింది. ఈ రోజు సోదరుడు...అక్కచెల్లెళ్ల ఇంటికివెళ్లి భోజనం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.
మొత్తం 5 రోజుల పాటూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు..