Diwali 2024: హిందువుల పూజల్లోకెళ్ల కాంతివంతమైంది చాలా మందికి ప్రీతిపాత్రమైంది. అత్యంత పవిత్రమైంది. అందుకే దీపావళి అంటే ప్రతి హిందువు కూడా చాలా ఆనందంతో జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగ చాలా ప్రత్యమైందిగా చూస్తారు. దీపావళికి ముందు ప్రజలు తమ ఇంటికి కొత్త వస్తువులు తీసుకురావాలని చూస్తారు. ఈ క్రమంలో కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదు. అలాంటివి తీసుకొస్తే అరిష్టమని నిపుణులు చెబుతున్నారు. 


దీపావళి పండుగ, దీపోత్సవ్ అని కూడా పిలుస్తాము, ఇది చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. ఇది హిందువుల అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మనిషి జీవితంలోని చీకట్లు తొలగించి వెలుగునిస్తుంది. సానుకూలతను పెంపొందిస్తుంది. 


దీపావళి రోజున ప్రజలు తమ ఇళ్లలో లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేర్ మహారాజ్ కు పూజలు చేస్తారు. వారి వారి సంప్రదాయాలను బట్టి ఈ పూజలు చేస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుందని వారి నమ్మకం. 


దీపావళికి ముందు ప్రజలు అనేక వస్తువులు కొంటూ ఉంటారు. శాస్త్రా గ్రంథాలు, నిపుణులు సూచనల ప్రకారం దీపావళి సమయంలో మనం ఇంట్లోకి తీసుకురాకూడని వస్తువులు చాలానే ఉంటాయట. మనం తెచ్చే వస్తువులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీపావళికి ముందు కొన్ని రకాల వస్తువులను అస్సలు తీసుకురాకూడదని చెబుతారు. 


పొరపాటున కూడా వీటిని తీసుకురావద్దు


విరిగిన వస్తువులు - గాజులు, ఫర్నీచర్, ఇతర పాడైపోయిన వస్తువులు వంటి విరిగిన వస్తువులను ఇంటికి తీసుకురావద్దు. అలాంటివి దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకురాకూడదని చెబుతారు. 


నల్లని వస్తువులు - నల్లని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని కొందరు నమ్ముతారు. అందుకే నలుపు లేదా దానికి సమానంగా ఉండే ఏదైనా రంగు వస్తువులను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు. 


ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు - ఇప్పటికే ఉపయోగించిన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు, ఎందుకంటే అవి మీ ఇంటికి అశుభం కలిగించే ఓల్డ్‌ శక్తిని కలిగి ఉండవచ్చు అని అంటారు. 


పదునైన వస్తువులు - కత్తులు లేదా కత్తెర వంటి పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు, అలాంటి వస్తువులు సంఘర్షణకు దారితీస్తాయి. సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రతికూలతను పెంచుతాయి.


ప్రతికూల వస్తువులు - విచారకరమైన లేదా చెడు జ్ఞాపకాలతో సంబంధం ఉన్న ఏదైనా స్వాగతించకూడదు. ఒకరి పాత ఫోటో లేదా దానితో ఉన్న చెడు జ్ఞాపకాలను కలిగి ఉన్న ఏదైనా వస్తువును తీసుకురావద్దు. 


వివరణ: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహాతీతమైన సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించే వాటితో ఏబీపీ దేశం వెబ్‌సైట్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీన్ని ఆమోదించదు. ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.


Also Read: ఈ ఏడాది దీపావళి ఎప్పుడో తెలుసా? తేది, చరిత్ర, ప్రాముఖ్యతలు ఇవే