Dhanteras 2023: ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ధన్వంతరి జయంతి, క్షీరసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ రోజే. అందుకే ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. ఆభరణాలను పూజలో పెట్టి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తే సంపదకు కొదవ ఉండదని విశ్వసిస్తారు. అయితే ధన త్రయోదశి రోజు బంగారం, వెండితో పాటూ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే మరికొన్ని వస్తువులున్నాయి. అవేంటో చూద్దాం..


శ్రీ యంత్రం


ధన త్రయోదశి రోజు బంగారం, వెండి మాత్రమే కాదు శ్రీ యంత్రం కొనుగోలు చేసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. మరీ ముఖ్యంగా మతవిశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి రోజు కుదరకపోతే దీపావళి రోజు అయినా శ్రీ యంత్రారాధన చేస్తే శుభం జరుగుతుంది


Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!


చీపురు


దీపావళి సందర్భంగా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకే ఇంటిని శుభ్రం చేసే చీపుర్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు. చీపురును లక్ష్మీ దేవి స్వరూపంగా చెబుతారు. అందుకే ఈ రోజు చీపురు కొంటే పేదరికం తొలగిపోతుందని విశ్వసిస్తారు. 


మట్టి దీపాలు


దీపావళికి ఎలాగూ మట్టి ప్రమదిల్లో దీపాలు వెలిగిస్తారు. అందుకే మట్టి ప్రమిదలను ధన త్రయోదశి రోజు చేయడం  చాలా మంచిది. ఈ రోజు ఇంట్లోకి మట్టి దీపాలు తీసుకురావడం ద్వారా సుఖసంతోషాలు, సౌభాగ్యాలు మిగులుతాయని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతారు


Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!


ధనియాల విత్తనాలు 


ధన త్రయోదశి రోజు ధనియా విత్తనాలు అంటే కొత్తిమీర విత్తనాలు కొనుగోలు చేయడం శ్రేయస్కరం. పౌరాణిక విశ్వాసాల ప్రకారం దీపావళి పూజ సమయంలో లక్ష్మీదేవి దగ్గర ధనియాల విత్తనాలు పెట్టి వాటిని ఇంట్లో భద్రంగా దాచుకుంటే డబ్బు నిల్వ ఉంటుందని కొందరి విశ్వాసం.


గోమతి చక్రం


ధన త్రయోదశి రోజు గోమతి చక్రం కొనుగోలు చేస్తే...ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు పండితులు. ముఖ్యంగా ఈ రోజు 11 గోమతి చక్రాలను కొనుగోలు చేసి పసుపు వస్త్రంలో కట్టి అమ్మవారి దగ్గర పూజ తర్వాత లాకర్లో పెడితే మంచి జరుగుతుందంటారు


Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!


ధన త్రయోదశి ప్రత్యేకత ఇదే..


లక్ష్మీదేవి ఆవిర్భావం


అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని..అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


ధన్వంతరి జయంతి 


ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.  ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం  లభిస్తుందని చెబుతారు.