Datta Jayanti 2023: మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. దత్త అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. అలా దత్తాత్రేయుడిగా పూజలందుకుంటున్నాడు.


దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ |
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||


దత్తాత్రేయ జననం వెనుకున్న పురాణగాథ


 లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ, సర్వస్వతి, పార్వతిమాతలు...మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని అడిగారు. త్రిమూర్తూలు ఎంతవారించినా వినలేదు. ఇక చేసేది లేక సన్యాసి వేషం ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతానికి వెళ్లారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది..అక్కడ ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయింది. అదంతా చూసిన త్రిమూర్తులు తన్మయత్వానికి లోనై...ఈ ప్రకృతిలో మునిబాలురిలా ఆడుకుంటే ఎంత బావుంటుందో అనుకున్నారు. ఇంతలోనే తమ భార్యలకు ఇచ్చిన మాట గుర్తుచేసుకుని ఆశ్రమానికి వెళ్లారు. 


Also Read: రాశిమారిన బుధుడు ఈ 5 రాశులవారి ఫేట్ మార్చేస్తాడు!


చిన్నారులుగా మారిన త్రిమూర్తులు


మహా తపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని..ముని శ్రేష్టుడైన అత్రిమహర్షిని వివాహం చేసుకుని పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూ, పంచభూతాలు, అష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేసింది. ఆమెలో తేజస్సుని - అత్రిమహర్షిని చూసి త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు, సాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి భోజనాలు సిద్ధం చేశారు. భోజనం ప్రారంభించే సమయంలో త్రిమూర్తులు ముగ్గురూ... అనసూయాదేవి తమకు దుస్తులు లేకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని పలికారు. ఒక్కసారిగా పిడుగుపడినట్టు భావించిన అనసూయ..తన పతి కాళ్లకు నమస్కరించింది. వచ్చిన వారు సామాన్యులు కాదు త్రిమూర్తులు అని తెలుసుకుంది. వారి ఆంతర్యం గ్రహించింది.  భర్తకు నమస్కరింది కమండలంలో నీట్ని త్రిమూర్తులపై చల్లింది. వెంటనే వారు పసిబాలురయ్యారు. అప్పుడు అనసూయలో మాతృత్వం పొంగింది. ముగ్గురు చిన్నారులకు పాలిచ్చి ఆకలి తీర్చింది. మెత్తని పూల పాన్పుపై జోలపాడుతూ నిదురపుచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి తుళ్లిపడి...ఆ తర్వాత దివ్యదృష్టిలో జరిగింది, జరగబోయేది గ్రహించుకున్నాడు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయౌనిజులైన కొనసాగారు. 


Also Read:  మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి - ఈ రోజు చదవాల్సిన స్త్రోత్రం ఇదే!


లక్ష్మీ-సరస్వతి-పార్వతి గుబులు


లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్లుసుకున్నారు. వారిలో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. ఆశ్రమానికి వెళ్లారు. వారిని సాదరంగా ఆహ్వానించింది అనసూయ. పతిభిక్ష పెట్టమని వేడుకున్న వారితో.. మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకేరూపుతో, అమాయకంగా నోట్లో వేలువేసుకోని, నిద్రిస్తున్న అ జగన్నాటక సూత్రధారులను ఎవరు? ఎవరో? గుర్తించుకోలేక పోయారు. నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేపడతారు. అప్పుడు అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకం చల్లగా త్రిమూర్తులు సాక్షాత్కరించారు. 


Also Read: ఈ రాశివారి ఊహలు నిజమయ్యే సమయం దగ్గర పడింది, డిసెంబరు 26 రాశిఫలాలు


దత్తాత్రేయుడి జననం


త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమవాస సమయమందు, మీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అప్పుడు దత్తాత్రేయుడిగా అత్రి-అనసూయకు పుత్రుడిగా జన్మించారు త్రిమూర్తులు.


దత్త జయంతి రోజు ఏం చేయాలి!


 దత్తాత్రేయుడికి షోడశోపచార పూజను చేస్తారు. దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రసాధించేవాడు. ఆయన కృప ఉండాలని దత్త జయంతి రోజున ధ్యానం, జపం  చేస్తారు. దత్తాత్రేయుడు గురువుల లాగా యోగ మార్గాన్ని అనుసరించాడు. అందుకే ఆయన్ను కొలిచేవారు కూడా ఆయన అనుసరించిన యోగ మార్గంనే తాము కూడా అనుసరిస్తామని నిర్ణయం తీసుకుంటారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్తజయంతి రోజున పారాయణం చేస్తారు.  దత్తజయంతి రోజు దత్తాత్రేయుడిని ఆరాధించినవారి జన్మ ధన్యం అవుతుంది. పిల్లలు లేనివారికి ఆ త్రిమూర్తల కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.


Also Read: అనసూయ మహా పతివ్రత ఎందుకంటే!