Dakshinayana 2023: భారతదేశంలో మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం జనవరి నెల‌లోను, కర్కాటక లేదా కటక లేదా కర్క సంక్రాంతిని జూలై నెల‌లోనూ జరుపుకొంటారు. ఇది సౌర పంచాంగాన్ని అనుస‌రించి నిర్వ‌హిస్తారు. సూర్యుడు తన ఉత్తరాయణ సంచారాన్ని మకర సంక్రాంతి నుంచి ప్రారంభిస్తే.. ద‌క్షిణాయ‌న సంచారాన్ని కర్కాటక రాశి లేదా కర్కాటక సంక్రాంతి నుంచి ప్రారంభిస్తాడు. ఉత్తరాయణం - దక్షిణాయనం ప్రాముఖ్యత, భేదాలు తెలుసా..


1. ఉత్తరాయణం
మనకు తెలిసినట్లుగా సంవత్సరంలో రెండు అయనాలు లేదా అయనాంతం ఉంటాయి. అంటే సూర్యుడు ప్రతి సంవత్సరం రెండు సార్లు తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఈ మార్పులను ఉత్తరాయణం అంటే వేసవి కాలం.. దక్షిణాయణం అంటే రుతుపవన కాలం అని పిలుస్తారు. సూర్యుని ఉత్తరాయణ సంక్ర‌మ‌ణం మకర సంక్రాంతి రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనిని సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. 


Also Read : ఈ మూడు రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం బిందాస్!


2.దక్షిణాయణం
ఉత్తరాయణంలో, సూర్యుడు మకర రాశి నుంచి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు, అయితే దక్షిణాయణంలో, కర్కాటకం లేదా కటక రాశి నుంచి తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. ఉత్తరాయణంలో సూర్యుని గమనం ఉత్తరం వైపు ఉంటే, దక్షిణాయణంలో సూర్యుని గమనం దక్షిణం వైపు ఉంటుంది. ఇది 6 నెలల సుదీర్ఘ కాలం కొన‌సాగుతుంది. 


సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు పగలు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో అనేక పండుగలు, తీర్థయాత్రలు ఉంటాయి. ఈ కాలాన్ని దేవతారాధ‌న‌, దానాలు, ధ‌ర్మాలు, వివాహాలు మొదలైన వాటికి అనుకూల‌ కాలం అని కూడా అంటారు. దక్షిణాయణంలో పగలు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. ఈ ఆదిలో ఎటువంటి శుభకార్యాలు చేయ‌కూడ‌ద‌ని చెబుతారు. ఈ సమయంలో దేవతలను ఆరాధించడం చాలా ముఖ్యమని పేర్కొంటారు.


3. ఉత్తరాయణం - దక్షిణాయణం ప్రాముఖ్యత
హిందూ గ్రంధాల ప్రకారం, ఉత్తరాయణం అంటే సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణించే కాలం, దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఆరు ఋతువుల్లో.. శీతాకాలం, వసంతకాలం, వేసవికాలం ఈ అయనాంతంలో వస్తాయి. పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఉత్తరాయణం వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉన్నాడు. ఈ పవిత్రమైన రోజున గంగ స్వర్గం నుంచి భూమికి చేరిందని నమ్ముతారు. ఉత్తరాయణంలో యాగాలు, తపస్సులు, వివాహాలు మొదలైనవి నిర్వహిస్తారు.


Also Read : కర్కాటక రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారికి ఆదాయం, పదోన్నతి!


అలాగే ఉత్తరాయణాన్ని భగవంతుడికి పగలు అని, దక్షిణాయనాన్ని భగవంతుడికి రాత్రి అని చెబుతారు. దక్షిణాయనంలో శీతాకాలం, శరదృతువు, వర్షాకాలం ఉంటాయి. దక్షిణాయన సమయంలో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. సాధన పరంగా, దక్షిణాయనం శుద్ధి కోసం, ఉత్తరాయణం జ్ఞానోదయం కోసం కేటాయిస్తారు. కాబట్టి, ఉత్తరాయణం అనేది సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపున‌కు వెళ్లడాన్ని సూచిస్తే.. దక్షిణాయణం దానికి వ్యతిరేకమని మనం తెలుసుకోవచ్చు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.