ఒక్కొక్కరిదీ ఒక్కో మెంటాలటీ, ఎవరి తీరు వారిది, ఎవరి ఆలోచనలు వారివి. మరొకరితో పోల్చుకునేందుకు ఉండదు. మహా అయితే కొందరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి కానీ సేమ్ టు సేమ్ అని చెప్పలేం. అయితే అది కూడ మీ జన్మ నక్షత్రంపై ఆధారపడి ఉంటుందంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. 


బృహత్సంహిత ప్రకారం మీ నక్షత్రం బట్టి మీరు ఈ లక్షణాలు కలిగి ఉంటారు
అశ్విని : మంచి రూపం, నలుగురి ఆదరణ కలిగినవారు, నీతివంతులు, చక్కగా మాట్లాడేవారు
భరణి : దృడ నిశ్చయులు , సుఖపడతారు, నిజమే మాట్లాడతారు, ఆరోగ్యంగా ఉంటారు
కృత్తిక : తేజస్సు ఉంటుంది
రోహిణి : సత్యవంతులు, నీట్ నెస్ ఎక్కువ, ప్రియంగా మాట్లాడతారు, స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు, మంచి రూపం కలిగి ఉంటారు
మృగశిర : చంచల స్వభావం, ఉత్సాహంగా ఉంటారు, హాస్య చతురులు, భోగాన్ని అనుభవిస్తారు
ఆరుద్ర : గర్వం వీరి సొంతం, అయిన వారిపట్ల మాత్రమే ప్రేమ కలిగి ఉంటారు
పునర్వసు : వీరిది చాలా మంచి స్వభావం, అల్ప సంతుష్టులు, రోగులు
పుష్యమి : శాంతస్వభావం కలవారు, తెలివైన వారు, ధర్మ పరాయణులు
ఆశ్లేష : సర్వ భక్షకులు, కృతఘ్నులు,  సున్నితత్వం కలవారు
మఘ : భోగులు, ధనవంతులు, పిత్రు భక్తులు, ఉద్యమ లక్షణాలు కలిగి ఉంటారు


Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే


పూర్వఫల్గుణి (పుబ్బ) : ఎప్పుడు ప్రియ వచనాలు పలుకుతారు, దాతలు, రాజసేవకులు
ఉత్తరఫల్గుణి (ఉత్తర) : భోగులు, సుఖపడతారు, విద్యా ప్రాప్తి కలవారు
హస్త : ఉత్సాహవంతులు , కష్టపడే మనస్తత్వం
చిత్త : పెద్ద పెద్ద కళ్లుంటాయి, గడసరులు
స్వాతి : ప్రియ వాక్కు కలవారు, ధర్మశ్రితులు 
విశాఖ : ఈర్ష బుద్ధి కలవారు, మంచిగా మాట్లాడతారు
అనూరాధ : విదేశీ యానం చేస్తారు, ధర్మాత్ములు
జ్యేష్ఠ : చాలామంది స్నేహితులు కలవారు, జీవితాన్ని సంతృప్తిగా అనుభవిస్తారు, కోపం ఎక్కువ
మూల : లక్ష్మి పుత్రులు , సుఖపడతారు, స్ధిర మనసు కలవారు


Also Read:   శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే


పూర్వషాడ : సౌహర్ర్ధ హృదయం కలవారు, ఇష్ట పూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడే వారు
ఉత్తరాషాడ : ధార్మికులు, చాలామంది స్నేహితులు కలవారు, కృతజ్ఞత కలిగిన వారు 
శ్రవణం : ఉదార స్వభావం కలవారు, ఖ్యాతి పొందేవారు , ధనవంతులు
ధనిష్ట : దాతలు, ధనాన్ని సంపాదిస్తారు, సంగీత ప్రియులు
శతభిషం : సాహసికులు, కోప స్వభావం కలవారు, వ్యసన పరులు
పూర్వాభాద్ర : సంతోషాన్ని తృప్తిగా అనుభవించలేరు, ధనవంతులు, దాతలు
ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానం కలవారు, ధార్మికులు, జితశత్రులు , వక్తలు
రేవతి : శూరులు, శుచివంతులు


Also Read:  శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి