Kedarnath Shrine Opens: పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. ఉత్తరాఖండ్‌లో నెలకొన్న ఈ ఆలయం దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత నేటి నుంచి భక్తుల దర్శనార్థం తెరిచారు.శుక్రవారం ఉదయం 6.25 గంటలకు వేద మంత్రాల మధ్య తలుపులు తెరిచారు.
కనులపండువగా
అంతకుముందు ప్రధాన పూజారి నివాసం నుంచి కేదార్‌నాథుడి డోలీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి 10వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల పూలతో అలంకరించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తొలి పూజ చేశారు అర్చకులు. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ధామ్ ప్రతిధ్వనించింది.
చార్‌ధామ్ యాత్ర
చార్‌ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఈనెల 3వ తేదీనే తెరుచుకున్నాయి. బద్రినాథ్ ఆలయం ఈనెల 8వ తేదీన తెరవనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్‌ధామ్‌లుగా పిలుస్తారు. ఈ ఆలయాలు సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయి ఉంటాయి. వేసవి నుంచి ఆరు నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుంటుంది.
Also Read: COVID Cases In India: కొత్తగా 3,545 కరోనా కేసులు నమోదు- ఎంత మంది మృతి చెందారంటే?
Also Read: Shankaracharya Jayanti 2022: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది