Powerful Hanuman Mantras For Tuesday: హిందూ మతంలో, మంగళవారం ఆంజనేయుడికి అంకితం చేయబడింది. ఈ రోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. దీంతో పాటు జాతకంలో కుజుడు కూడా బలవంతుడు అవుతాడు. అంగారకుడి శుభ ప్రభావం వల్ల మాత్రమే వ్యక్తికి భూమి, ఆస్తి ఆనందం లభిస్తుందని చెబుతారు. జీవితంలో శుభ ఫ‌లితాలు సాధించాలంటే మంగళవారం ప‌ఠించాల్సిన‌ అద్భుతమైన మంత్రాలు ఏమిటో తెలుసుకోండి. ఇవి ఆంజనేయ స్వామిని సంతోషపరుస్తాయి.


భయం నుంచి విముక్తి కోసం 


"ఓం దక్షిణ్ముఖాయ పచ్చముఖ హనుమతే కరాలాబదనాయ"


మంగళవారాల్లో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషిలో విశ్వాసం పెరుగుతుంది. ఆ వ్యక్తికి భయం తొల‌గిపోతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దయ్యాల భయం, జీవితంలో అడ్డంకులు, ఇతర ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.


Also Read : హనుమాన్ చాలీసా ఎందుకు పఠించాలో తెలుసా?


సానుకూల శక్తి కోసం


"నరసింహాయ ఓం హాం హేం హోయం హాం హాః సకలభీతప్రేతదామనాయ స్వాహా"           


ఆంజనేయ స్వామికి చెందిన‌ ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం చాలా ప్రయోజనకర‌మ‌ని పండితులు ప‌రిగ‌ణిస్తారు. దీనిని కనీసం 21 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తిలో సానుకూల శక్తులు వెల్లివిరుస్తాయి.


ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రం                  


"ఓం పూర్వకపిముఖ పచ్ముఖ హనుమతే తుం తుం తుం తుం తుం సకల శత్రు సమహరణాయ స్వాహా"              


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు నాశనం అవుతారు. మంగళ, శనివారాల్లో ఈ మంత్రాన్ని పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది.


వ్యాధి నయమ‌వ‌డానికి


ఓం హనుమతే నమః


ఆంజనేయ స్వామి నామంతో ఉన్న‌ ఈ మంత్రం చాలా ప్రజాదరణ పొందినది, అంతేకాకుండా అత్యంత ప్రయోజనకరమైన మంత్రం. ఈ సరళమైన మంత్రాన్ని పఠించడం వలన జీవితంలోని ప్రతి బాధ, వ్యాధి తొలగిపోతుందని పెద్ద‌లు చెబుతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.                        


Also Read : వివిధ రూపాల్లోని హనుమంతుడిని పూజిస్తే వ‌చ్చే ఫ‌లితాలివే


అన్ని కోరికలు నెరవేర్చడానికి


"మంగళ భవన్ అమంగళహరి ద్రవహు సో దశరథ అజీర విహారీ"                    


ఈ ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించడం వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటాడు. అలాగే అతని కోరికలన్నీ నెరవేరుతాయి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.