Hanuman Chalisa Benefits : శాస్త్రాల ప్రకారం, హనుమంతుని ఆరాధన కలియుగంలో అత్యంత ముఖ్యమైనది, మొదటిది, ప్రధానమైనదిగా వర్ణించారు. రామనామం ఉన్నచోట హనుమంతుడు ఉంటాడు. రాముడు ఎక్కడ పూజ‌లందుకుంటాడో అక్కడ ఆంజ‌నేయుడు ఉంటాడు. అందుకే చాలామంది హనుమంతుని అనుగ్రహం కోసం రామ నామాన్ని జపిస్తూ శ్రీరాముని పూజిస్తారు. అయితే చాలా మంది హనుమంతుని అనుగ్రహం పొందడానికి హనుమాన్ చాలీసా పఠించమని చెబుతారు. మరి హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలో తెలుసా?


అదృశ్య శక్తుల నుంచి రక్షణ
హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మనం దెయ్యాలు, ఆత్మలు వంటి అదృశ్య శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇది గ్రహాలు, రాశుల చెడు ప్రభావాల నుంచి మనల్ని రక్షిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చెడు, ప్రతికూల శక్తి మనపై పడదు.


ప్రమాదాల నివార‌ణ‌కు
ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేసే వ్యక్తికి ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు ఉండవని నమ్ముతారు. ఈ చాలీసా పారాయణం ఒక వ్యక్తిని పూర్తి కవచంలా కాపాడుతుంది.


భయాన్ని అధిగమించడానికి
మీకు తెలిసి కానీ, తెలియకుండా కానీ ఏదైనా విష‌యంలో భయప‌డుతుంటే, మీరు హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. ఇది జీవితాన్ని నిర్భయంగా చేస్తుంది, మీలో ధైర్యాన్ని పెంచుతుంది.


మనశ్శాంతి కోసం
మీరు మానసిక అశాంతికి గురవుతున్నా, మానసిక ప్రశాంతత పొందాలంటే, అధిక శ్రమ వల్ల మీ మనస్సు అస్థిరంగా ఉంటే, ఏదైనా కుటుంబ, ఇంటి సమస్య వేధిస్తున్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించాలి. అలా చేయ‌డం వ‌ల్ల‌ అద్భుత ఫలితాలు ఇస్తుందనడంలో సందేహం లేదు. ఫ‌లితంగా మానసిక రుగ్మతలన్నీ తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.


వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనిషికి అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి. కానీ, హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు హనుమంతుడు అన్ని రకాల బాధలను తొలగిస్తాడని పూర్తి న‌మ్మ‌కంతో ఉండాలి.


సమస్యల ప‌రిష్కారం
హనుమంతుని ఆరాధన, మంత్రాలను పఠించడం లేదా నామ స్మరణ చేయడం వల్ల మన జీవితంలోని అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. హనుమంతుడు మనల్ని అన్ని రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు. జీవితంలో ఏదైనా సంక్షోభం ఉంటే, హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ 7 సార్లు చదవాలి.


బలం, జ్ఞానం కోసం
హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మనిషిలో జ్ఞానం మేల్కొంటుంది. అతను తన విచక్షణతో పని చేయ‌డ‌మే కాకుండా, తప్పుఒప్పుల‌ను తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. దీనితో పాటు అతని శారీరక బలహీనత తొలగిపోతుంది. ఈ మేర‌కు హనుమంతుడు అతనికి శక్తిని ప్ర‌సాదిస్తాడు. ఆ వ్యక్తి అన్ని రకాల ప్రాపంచిక జ్ఞానాలలో కూడా ప్రావీణ్యం పొందుతాడు.


ఇంట్లో బాధ‌ల నుంచి ఉపశమనం
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంట్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు, అన్ని రకాల కష్టాలు నశిస్తాయి. భక్తుడు అన్ని రకాల అడ్డంకుల నుంచి విముక్తి పొందుతాడు.


Also Read : హనుమంతుడు తన భక్తులను 10 రకాల కష్టాల నుంచి రక్షిస్తాడు


శని, రాహు, కేతు ప్రభావం నుంచి విముక్తి
ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేసే వ్యక్తికి శని, రాహు, కేతువుల వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. ఏల్నాటి శని దోషం జరుగుతున్నప్పటికీ, అత‌నికి ఎలాంటి సమస్యలు రావు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.