Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మంచి జీవితం కోసం ఎన్నో సూత్రాలను అందించాడు, వీటిని అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో విజయమ‌నే నిచ్చెనను సులభంగా అధిరోహించగలడు. మన జీవితంలో ఎంతమంది శత్రువులు ఉంటారో అంతకంటే ఎక్కువ‌మంది స్నేహితులుంటారు. ఇంతమంది మన సంతోషాన్ని, దుఃఖాన్ని తమదిగా భావించి, సుఖ దుఃఖాలలో మనతో పాటు ఉంటారు.  జీవితంలో మ‌నం ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకునే వాళ్లు త‌ల్లిదండ్రులే. వారు ఎలాంటి స్వార్థం లేకుండా మ‌న బాగు కోసం నిరంత‌రం ప‌రిత‌పిస్తుంటారు. అదే విధంగా కొన్నిసార్లు మనల్ని నీడలా అనుసరించే మన స్నేహితులను తెలిసో తెలియకో బాధపెడతాం. దీని గురించి చాణక్యుడు త‌న‌ చాణక్య నీతిలో కూడా చెప్పాడు. చాణక్యుడి విధానంలో మ‌న తల్లిదండ్రుల‌తో, స‌న్నిహితుల‌తో మనం ఎప్పుడూ గొడవ పడకూడదని, కోపం తెచ్చుకోకూడదని స్ప‌ష్టంచేశాడు. వారితో పోట్లాడితే జీవితాంతం పశ్చాత్తాపంతో గడపాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించాడు.  అయితే మ‌నం ఎవరిపై ఎప్ప‌డూ కోపం చూపించ‌కూడ‌దో తెలుసా?


1. తల్లిదండ్రులు
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ప‌రుష‌మైన మాట‌లు మన జీవితాలతో పాటు సంబంధాలను కూడా నాశనం చేస్తాయి. మన తల్లిదండ్రులతో మాట్లాడేట‌ప్పుడు ఎప్పుడూ దూషించే పదాలు ఉపయోగించకూడదని చాణక్యుడు చెప్పాడు. కష్టపడి పెంచి, మంచి నడవడిక నేర్పి, మన భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన‌ తల్లిదండ్రుల గురించి దూషించే మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులను బాధపెడితే పాపులం అవుతాం. మనం చేసిన ఈ తప్పుకి ప్రాయ‌శ్చిత్తం అనేదే లేదు.


Also Read : స్త్రీలలో ఈ 5 లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందట!


2. ఆవేశంలో నోరు జార‌వ‌ద్దు
మన జీవిత పురోగతిలో తల్లిదండ్రుల స్థానం చాలా ఎక్కువ, తల్లిదండ్రులతో ఏదైనా మాట్లాడే ముందు మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఒక‌సారి వ‌దిలిన బాణం ఎప్పటికీ తిరిగి రాదు, ఒకసారి మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోలేము. చాలాసార్లు కోపంగా ఉన్న వ్యక్తి తన ఆవేశాన్ని, కోపాన్ని తల్లిదండ్రులపై చూపిస్తాడు. కానీ, కోపంలో నిర్ణ‌యాలు తీసుకుంటూ, తన ఉన్న‌తికి కారణమైన వారిపై తన శక్తిని ప్రదర్శిస్తున్నాన‌న్న విష‌యాన్ని మరచిపోతాడు. అలాంటి సంద‌ర్భాల్లో తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు.


తల్లిదండ్రులు తమ జీవితమంతా మన కోసం, మన సంతోషం కోసం అంకితం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను ప‌ణంగా పెట్టి పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ, కోపంతో మనం అనే ఒక మాట వారి హృదయాలను గాయ‌ప‌రుస్తుంది. మన పరుషమైన మాటలు వారి కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. కాబట్టి, తల్లిదండ్రులతో మాట్లాడే ముందు దూషించే పదాలను ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఆలోచించి, మన నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడండి.


Also Read : ఈ ముగ్గురికి దూరంగా ఉండ‌క‌పోతే ప్రాణాపాయం త‌ప్ప‌దు.. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.