చాణిక్య నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గ దర్శనం చేస్తాయి. జీవితం సజావుగా సాగేందుకు ఆయన సూచించిన ఏమార్గాన్ని గమనించినా అందులో వివేకం, విచక్షణ, జ్ఞానం దాగి ఉండడాన్ని గమనించవచ్చు. మన జీవితంలో కొన్ని జీవులను ఎప్పటికీ నిద్ర లేపకూడదని చాణిక్యుడు సూచించాడు. అవేమిటో తెలుసుకుందాం.


ఆచార్య చాణిక్యుడు అందరికీ తెలిసిన గురువే. ఎన్నో శతాబ్దాల క్రితం ఆయన రూపొందించిన జీవన సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయాలు. ఆయన సూచించిన మార్గాల ద్వారా ఆయనను సంఘ సంస్కర్తగా కూడా భావించవచ్చు. అపారమైన జ్ఞానాన్ని ఆయన ఈ ప్రపంచానికి అందించాడు. ఆయన సూచించిన మార్గంలో పయనించి జీవితాన్ని విజయ పథాన నడిపంచుకోవచ్చు. ఆయన రూపొందించిన విధానాల్లో ఒక విషయం గురించి ఇవ్వాళ చర్చించుకుందాం. 7 రకాల జీవులను గురించి ఆయన ప్రస్తావించాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ 7 రకాల ప్రాణులను నిద్ర లేపితే ఆపద కొని తెచ్చుకున్నట్టేనట.


అహిన్ నృపాణ్ చ శార్దూలం కితిన్ చ బాల్కన్ తత్ ।


పార్శ్వానాం చ మూర్ఖం చ సప్త సుప్తాన్ బోధ్యాత్ ॥


పాము, రాజు, సింహం, చిరుతపులి, పసి పిల్లలు, వెరొకరి పెంపుడు కుక్క  మాత్రమే కాదు మూర్ఖుడు కూడా. ఈ 7 ప్రాణులను ఎప్పడూ నిద్ర లేపకూడదట. అలా చేస్తే అది మీకు ప్రమాదం కలిగిస్తుందనేది చాణిక్యుడి సూచన. వీటిని అసంపూర్ణ నిద్ర నుంచి మేల్కొలిపితే వాటి కంటే ప్రమాదం మీకే ఎక్కువ అని చెబుతున్నాడు.


రాజు


రాజును నిద్ర లేపితే అతడికి కోపం రావచ్చు. రాజు కోపం ఎప్పుడూ ప్రమాదకరమే. ఆయన కోపం మీ ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. లేదా మిమ్మల్ని రాజు శిక్షించనూ వచ్చు.


సింహం


నిద్రిస్తున్న సింహాన్ని నిద్రలేపడం లేదా బద్దకంగా ఉన్న సింహంతో పరాచికం చాలా ప్రమాదం. దానికి విసుగు కలిగితే అది మీ పై దాడిచేసి ప్రాణాలను తియ్యగలదు.


పాము


పాము విశ్రాంతిగా పడుకుని ఉంటే.. దాన్ని ఎప్పుడూ ఆటంక పరచవద్దు. అది నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న వాళ్లని కాటెయ్యవచ్చు.


చిన్న పిల్లలు


పసి పిల్లలు నిద్ర పోతుంటే వారి నిద్రకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూసుకోవాలి. సగం నిద్ర నుంచి లేచిన పసి పిల్లలు చాలా చిరాకుగా ఉంటారు. అందువల్ల అకారణంగా ఏడుస్తారు. వారిని సముదాయించడం చాలా కష్టమవుతుంది.


కుక్క


ప్రశాంతంగా నిద్ర పోతున్న కుక్కకు కూడా నిద్రాభంగం కలిగించకూడదు. దానికి కలిగిన నిద్రాభంగంలో ఇబ్బంది ఏర్పడి అది ఎదురుగా ఉన్న వాళ్లను కరిచే ప్రమాదం ఉంటుంది.


మూర్ఖ మానవుడు


మూర్ఖ మానవుడిని నిద్ర లేపితే కష్టాలు కలుగుతాయి. నిద్ర పోయ్యే మూర్ఖుడిని నిద్ర లేపితే అతడు నిద్ర లేవగానే లేపినందుకు గానూ మీతో గొడవ ప్రారంభిస్తాడు. ఎంత అవసరమున్నా సరే అలాంటి వారిని నిద్ర లేపకూడదు.


కనుక ఈ ఏడు రకాల ప్రాణులకు నిద్రాభంగం కలిగించడం ప్రమాదం కనుక ఎట్టి పరిస్థితుల్లో వీటిని నిద్ర లేపకూడదు అని చాణిక్యుడు సూచన చేశాడు.


Also Read: నెమలి ఈకను ఈ దిశలో పెడితే లక్ష్మీదేవి నట్టింట్లో ఉన్నట్లే!


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.