Chanakya Niti In Telugu : స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. ఆయ‌న‌కు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడ‌నే పేర్లు కూడా ఉన్నాయి. ఆయ‌న రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ ఆర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు. కేవలం రాజనీతి, అర్థశాస్త్రం గురించి మాత్రమే కాకుండా మాన‌వుడు స‌మాజంలో సంతోషంగా బతికేందుకు ఎన్నో విషయాలు బోధించాడు చాణక్యుడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఎలా దాటాలో కూడా సూచించాడు. జీవితంలో మనం ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలా నడుచుకోవాలో చాణ‌క్యుడు చ‌క్క‌గా వివరించాడు. ఆర్థిక విజ‌యాల‌కు, పేద‌రికం నుంచి బ‌య‌టప‌డ‌టానికి జీవితంలో త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన 4 నియ‌మాల‌ను చాణ‌క్యుడు వివ‌రించాడు. ఈ నియ‌మాల‌ను పాటించిన వారికి సంక్షోభ స‌మ‌యాల్లోనూ జీవితం సంతోషంగా గ‌డిచిపోతుంద‌ని తెలిపాడు.


ఆర్థికంగా విజయం  సాధించడానికి చాణ‌క్య నీతి అనేక ఉపాయాలు బోధించింది. మీరు పేదరికం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌నుకుంటే చాణక్యుడు చెప్పిన ఈ నియ‌మాల‌ను ఖచ్చితంగా పాటించండి. ధ‌నం గురించి నీతి శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకుందాం.


Also Read: గుండు చేయించుకుంటున్నారా, ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా!


మూర్ఖుల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌కండి


తెలివైన వ్యక్తి కూడా కొన్నిఎలాంటి పరిస్థితుల్లో బాధపడాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఎంత తెలివైన వారైనా,  సంతోషంగా లేని వ్యక్తితో సత్సంబంధాలు కలిగి ఉంటే వారు కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే మీ ధ‌నాన్ని రక్షించుకోండి. మూర్ఖులకు సలహా ఇవ్వకండి, ఎందుకంటే అది మీ విలువైన‌ సమయం, డబ్బు రెండూ న‌ష్టపోయేలా చేస్తుంది అని చాణ‌క్యుడు హెచ్చ‌రించాడు. 


దాతృత్వం అల‌వ‌ర‌చుకోండి


డబ్బు ఒక వ్యక్తికి గౌరవంతో పాటు కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌ను తెస్తుంది. సంతోషంగా ఉంటూ ధనవంతులుగా మారడానికి, మీ సంపాదనలో కొంత భాగాన్ని దాతృత్వం కోసం వెచ్చించాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


డ‌బ్బు కొర‌త రాకుండా చూసుకోండి


జీవితంలో ఆనందం-శ్రేయస్సు, డబ్బు కొర‌త రాకుండా చూసుకోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ వారి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. తమ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసిన వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించి అంద‌రిలో ప్ర‌త్యేకంగా నిలుస్తారు.


Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..


న‌ష్ట‌పోయినా ఎవ‌రికీ చెప్పొద్దు


పురుషులు తమ సంపాదన మొత్తాన్ని ఎవరికీ చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, లావాదేవీలో డబ్బు నష్టపోయినా మీకు ఎంత స‌న్నిహితుడైన‌ వ్య‌క్తికి కూడా ఆ విష‌యం చెప్ప‌కూడ‌ద‌ని, గోప్యంగా ఉంచాల‌ని సూచించాడు. ఈ విష‌యం ఇత‌రుల‌కు తెలిస్తే గౌరవం, ప్రతిష్ట దెబ్బతింటుంది ఫ‌లితంగా దుఃఖం చుట్టుముడుతుందని తెలిపాడు.


అవ‌స‌రం మేర‌కే ఖ‌ర్చు చేయండి


డబ్బును భద్రతగా, దానధర్మంగా, పెట్టుబడిగా ఉపయోగించే వ్యక్తి సంక్షోభ సమయాల్లో సంతోషంగా జీవిస్తాడు. డబ్బు ఖర్చు చేయడంలో సంతులనం చాలా ముఖ్యం, డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి, దీని కోసం మీ అవసరాలను పరిమితం చేయడం అత్యంత అవసరం. అవసరం ఉన్నంత వ‌ర‌కు మాత్రమే ధ‌నాన్ని ఖర్చు చేయాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


క‌ష్టార్జిత‌మే శ్రీ‌రామ‌ర‌క్ష‌


కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మంచిది, ఎందుకంటే అనైతిక కార్య‌క‌లాపాల‌ ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు, అటువంటి సంపాద‌న ద్వారా వ‌చ్చిన‌ డబ్బు కారణంగా త‌ద‌నంత‌ర కాలంలో నష్టాలను చవిచూడవలసి ఉంటుంద‌ని చాణ‌క్యుడు హెచ్చ‌రించాడు.