Chanakya Neeti Telugu: స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. కౌటిల్యుడు రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  గుప్తల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ కాలానికి చెందిన చాణక్యుడు తన అసమాన ప్రతిభాపాటవాలతో గుప్త సామ్రాజ్యంలో సుస్థిర పాలనకు బీజం వేశాడు. తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్నాడు. ఈయన రచించిన రాజనీతి గ్రంథమైన అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది.  


చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క స్వభావం,యోగ్యత ,దోషాలు,విద్య,వ్యాపార జీవితం,సంపద, వివాహం ఇలా అన్ని అంశాల గురించి ప్రస్తావించాడు. అలాగే...జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తి తన పనిపై అంకిత భావంతో ఉండాలని, కృషి-విధేయత-నిజాయితీ కలగి ఉండాలని తన నీతిశాస్త్రంలో చెప్పాడు. అదే సమయంలో, ఒక వ్యక్తికి నిజాయితీగా ఉండటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు. నిటారుగా ఉన్న చెట్టే అందుకు ఉదాహరణ అన్నాడు చాణక్యుడు. నిటారుగా ఉన్న చెట్టును నరికివేయడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదని..ఎవ్వరైనా సులభంగా పడదోయగలరు. అలా మితిమీరిన నిజాయితీతో ఉండే వ్యక్తి కూడా ఎందుకూ పనికిరానివాళ్ల కారణంగా కూడా బాధపడాల్సి ఉంటుందని, ఇతరులు తొందరగా వీరిని వినియోగించుకుంటారని బోధించాడు చాణక్యుడు.


Also Read:  ఈ ముగ్గురు వ్యక్తులతో అతి చనువు అత్యంత ప్రమాదకరం


అంటే నిజాయితీ ఉండకూడదన్నది చాణక్యుడి ఉద్దేశం కాదు. నిజాయితీ ఉండాలి కానీ ఆ నిజాయితీతో పాటూ పరిస్థితులను ఎదుర్కొనే తెలివితేటలు కూడా ఉండాలని చెప్పాడు చాణక్యుడు. క్లిష్టమైన వ్యక్తులను ఎదుర్కొనే తెలివితేటలు లేకపోతే మీ ప్రణాళికలు, మీ ఆలోచనలను దొంగిలించేవారు, మిమ్మల్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందని హెచ్చరించాడు. 


Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 


వ్యక్తికి విద్యా పరమైన విజ్ఞానంతో పాటు ఆచరణాత్మక జ్ఞానానికే కౌటిల్యుడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఇతరుల చేతిలో ధనం ఉంటే మనకు ఉపయోగం ఎలా ఉండదో, అలాగే విజ్ఞానం కూడా పుస్తకాల్లో బందీ అయిపోతే ఎవరికీ మంచి జరగదన్నాడు. తెలివైనవాడు తన తోటివారికి తగిన గౌరవం ఇస్తాడు...జ్ఞానం ఉన్నా దాని వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేకపోతే అతడు తెలివైన వ్యక్తి కాదంటాడు చాణక్యుడు. అందుకే నిజాయితీ, విజ్ఞానం ఉంటే సరిపోదు..అవి ఎక్కడ ఎలా వినియోగించాలో తెలుసుకోవాలంటాడు చాణక్యుడు.


కొందరు వ్యక్తులు కొన్ని సందర్భాల్లో తమ అహం, శౌర్యం, ఆత్మగౌరవం, అందం పట్ల ఆకర్షణతో అయోమయానికి గురవుతారు. ఇలాంటి సందర్భంలో తమకు అవసరమైంది ఏంటో అవగాహన చేసుకుని సమస్య నుంచి బయటపడటానికి తెలివైన వ్యక్తి ప్రయత్నిస్తాడు. సమస్యలు ఎదురైనప్పుడు అహాన్ని పక్కనబెట్టి వాటిని పరిష్కరించుకోవాలట. ఏదైనా పని చివరి దశలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పని వల్ల ముప్పు తొలగిపోయినా అది ఎందుకు ఎదురయిందో తెలుసుకోవాలి. అలాకాకుండా అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనతో విలువైన సమయాన్ని వృథా చేయరాదు. అందుకే నిజాయితీ ఉండడం కన్నా సమయాానికి తగిన తెలివి ముఖ్యం అని చాణక్యుడు తన శిష్యులకు బోధించాడు...