Budget During Lord Rama and Ramayan Period:  ప్రతి రాష్ట్రం పాలనకు, నిర్వహణకు పెద్ద మొత్తం డబ్బు వినియోగిస్తుంది. ఈ సంపాదనలో ప్రభుత్వం వసూలు చేసిన పన్ను ఆదాయం, అధీనంలో ఉండే రాజులు ప్రస్తుత రోజుల్లో కేంద్రంలో ఉండే పాలకులు ఇచ్చే మొత్తం ముఖ్యమైనవి. ఇవన్నీ రాష్ట్ర ఖజానాలో జమ అవుతూనే ఉంటాయి. ఈ డబ్బు రాష్ట్ర అభివృద్ధి , రాష్ట్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలకు ఖర్చుచేస్తారు. ఇప్పటి బడ్జెట్ సంగతి సరే.. అప్పట్లో రామాయణ కాలంలో బడ్జెట్ ఎలా ఉండేది? అసలే ఆదర్శవంతమైన రాజ్యం అంటే రామరాజ్యం అని చెబుతారు. మరి ఆ రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం పాలకుల ఆలోచన ఎలా ఉండేది? రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేసేవారు? వాల్మీకి రామాయణంలో ఈ ప్రస్తావన ఉంది.


Also Read: రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు, ఇన్‌కమ్ ట్యాక్స్‌పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన


అయోధ్య నగర వైభవం - ఆర్థిక వ్యవస్థ - పన్నుల వసూలు  గురించి వాల్మీకి రామాయణంలో వర్ణన


సామంత్రాజ్ సఘేశ్చ బలికర్మాభిరావృతం
నందేశనివాసశైశ్చ వణిగ్భిరూపశోభితం..


పన్నులు చెల్లించే సామంత రాజు ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రజలకు చేరువలోనే నివశించేవారు. వివిధ దేశాల్లో నివాసం ఉంటే వైశ్యుల ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసేవారు


Also Read: అత్యంత పవిత్రమైన 5 సరస్సులు - ఇవే పంచ సరోవరాలు!


పది సత్యాభిసంధేన్ త్రివర్గ మనుతిష్ఠ
పాలిట త పురీ శ్రేష్ఠ ఇంద్రేణేవమ్రావతి


ధర్మ, అర్థ, కామ విధులను నిర్వర్తిస్తూ, కర్మలను నిర్వహిస్తూ..సత్యప్రతిజ్ఞ చేసి...ఇచ్చిన మాట తప్పకుండా ఉత్తమమైన అయోధ్యపురిని చూసుకునేవాడు శ్రీరామచంద్రుడు


రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు రాజ్యం పరిస్థితి


కోశసంగ్రహణే యుక్త బాలస్య చ పరిగ్రహే
అహితం చాపి పురుషం న హింస్యుర్విధూషకం..


అంటే ఆర్థిక శాఖకు చెందిన వారు నిత్యం నిధులు పోగు చేయడంలోనూ, చతురంగిణి సేన సేకరణలోనూ నిమగ్నమై ఉండేవారు. శత్రువు ఏ నేరం చేయకపోయినా హింసను ప్రయోగించడం లాంటి కాకుండా..కేవలం ఆర్థిక వ్యవస్థను ముందుకి నడిపించేందుకు తగిన చర్యలు మాత్రమే తీసుకునేవారు. 


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


అన్తరపానీవీథియాశ్చ సర్వేచ నాత్ నర్తకాః ।
సుదా నార్యశ్చ బహవో నిత్యం యువనశాలినః।।


అశ్వమేధ ఉత్సవాల సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలు, అమ్మకం కోసం మార్గంలో వివిధ ప్రదేశాలలో మార్కెట్‌లు ఏర్పాటు చేసేవారు. ఆ యాగం నడిచినన్ని రోజులూ వ్యాపారం ఓ రేంజ్ లో సాగేది. వివిధ రాజ్యాలకు చెందిన వర్తకులు వ్యాపారం చేసేవారు. ఆ రోజుల్లో వర్తకులు కూడా అవినీతి అనే మాటని దరిచేరనివ్వలేదు. రామాయణ కాలంలో ట్యాక్స్ వసూలులో అవినీతి అస్సలే లేదు. 


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


సుమ్హాన్ నాథ్ భవేత్ తస్య తు భూపతః
యో హరేద్ బలిషద్భాగం న చ రక్షతి పుత్రవత్ । 


ప్రజల నుంచి వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ కన్నా ..వారి సంక్షేమంపై అంతకు మించి ఉండాలి. ఇవన్నీ ఆరోగ్యవంతమైన స్పృహతో కూడిన ఆర్థిక వ్యవస్థను సూచిస్తాయి.


పాలకుడు ధర్మం తప్పలేదు


రామరాజ్యంలో దొంగల భయం లేదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఎలాంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు. ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు. ఎలాంటి విరోధాలు లేకుండా అనురాగంగా నివసించే వాతావరణం ఉండేది. వర్షాలు సకాలంలో కురిసేవి. ప్రజలు రాగ, ద్వేషాలకు అతీతంగా తమ వృత్తుల్లో రాణించేవారు. రామచంద్రునితో సహా అందరూ సత్యాన్ని పలికేవాళ్లు. అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు ఆ నాటి సమాజంలో విలువ లేదు. ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు ఉండేవి కావు. మనిషి ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలోనే ఉన్నాయి అందుకే ఆయన పాలించిన రాజ్యాన్ని రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో పాలకుడు ధర్మ తప్పలేదు..ప్రజలు కూడా అదే పద్ధతిని అనుసరించారు.  నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నాడు. రాముడి పరిపాలన అంటే అంతా శుభమే..