విష్ణుమూర్తి దశవతారాల్లో ఒకటి నరహింహావతారం. ఈ రూపంలో విష్ణుమూర్తి సగం నరుడు, సగం సంహం ఆకృతిలో ఉంటాడు. ఈరూపంలో నాలుగు నుంచి పదహారు చేతులలో రకరకాల ఆయుధాలతో, రౌద్రరసం ఉట్టిపడే సింహ ముఖంతో దర్శనమిచ్చే దైవస్వరూపం నరసింహావతారం. ఈ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం, జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగిస్తాడనేది నమ్మకం.


సకల విశ్వాన్ని పాలించే విష్ణుమూర్తి లోక కల్యాణార్థం ప్రతి యుగంలో ఒక రూపంలో అవతరించాడు. ప్రతీ జీవి భగవంతుడి స్వరూపమే అని తెలిపేందుకు ప్రతీకగా యుగానికి ఒక్కో రూపంలో తన మహిమ చూపించాడు. అలా వెలసిన అవతారాల్లో నరసింహావతారం నాలుగొవదిగా చెప్పవచ్చు. సకళ మానవాళిని చెడు నుంచి హింస నుంచి కాపాడేందుకు అవతరించిన దేవదేవుడే నరసింహుడు. ఈ అవతారం సత్యయుగానికి చెందినదిగా చెప్పవచ్చు. ఈ అవతారాన్ని నరసింహుడు లేదా నరసింగముడు అని పిలుస్తారు. దుష్టత్వం నుంచి మానవతను కాపాడేందుకు అవతరించి దైవంగా భక్తులు కొలుచుకునే అవతారం ఈ నరసింహావతారం.


నరసింహావతారంలో సగం శరీరం నరుడిగాను సగం శరీరం సింహలా భీకరంగా ఉంటుంది. ఈ అవతారానికి 4 నుంచి 16 చేతులు వివిధ రకాల ఆయుధాలు ధరించి ఉంటాయి. భీకరావతారంలో ఉన్నప్పటికీ నరహింహుడి ఒక చేయి అభయముద్ర ధరించి శిష్ట జన రక్షణను సూచిస్తూ ఉంటుంది. లక్ష్మీ దేవి సహితంగా ప్రసన్న వదనంతో కూర్చున్న నరసింహుడు ఆరాధనీయుడు.


కేవలం ఈ భంగిమలో మాత్రమే కాదు దాదాపుగా 74 ఇతర భంగిమల్లో కూడా నరసింహావతారం కనిపిస్తుంది. చేతిలో ధరించిన ఆయుధాన్ని బట్టి ఆయన రూపానికి నామాలున్నాయి. నరసింహుడి ఆరాధనకు చాలా నిర్ధుష్టమైన నియమాలు ఆచరించాల్సి ఉంటుంది. ఆ స్వరూపాల్లో ఉగ్ర, కరంజ, లక్ష్మీ వరాహ, యోగ, జ్వాల, మలాల, భార్గవ, క్రోధ నరసింహ స్వరూపాలు బాగా ప్రాచూర్యంలో ఉన్నాయి.


నరసింహ ఆరాధనతో కలిగే లాభాలు


ఈ స్వామి వారిని ఆరాధించడం వల్ల చాలా రకాల ఐహిక కష్టాల నుంచి కడతేర వచ్చు. నియమ నిష్టలతో నరసింహారాధన చేసుకునే వారికి మోక్షం సంప్రాప్తిస్తుంది. సకల పాపాలు హరిస్తాయి. రోగ బాధ నుంచి విముక్తి లభిస్తుంది. గ్రహపీడల నుంచి స్వామి రక్షిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించే వారికి కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్య ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తయాని శాస్త్రాలు చెబుతున్నాయి. న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తున్న వారు స్వామి వారిని సేవించుకుంటే తప్పక విజయం లభిస్తుందట. శారీరక, మానసిక ప్రశాంతతకు స్వామి ఆరాధన దోహదం చేస్తుందట. ఏ ఇంట్లో స్వామికి నిత్యం పూజాధికాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు సకల సౌఖ్యాలతో కళకలలాడుతుంది.


 Also Read : ఖతర్నాక్ ‘కార్తె’ - రోహిణి వచ్చిందంటే మంటలే.. అందుకే రోళ్లు పగులుతాయ్, కళ్లు తిరుగుతాయ్










Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.