రామరావణ యుద్ధం చివరిఘట్టంలో రావణుడు మరణశయ్యపై పడి ఉన్నాడు. మహా జ్ఞాన సంపన్నుడైన రావణుడి దగ్గర నేర్చుకోవలిసిన విషయాలు ఎన్నో ఉన్నాయని అవి తెలుసుకుని రమ్మని లక్ష్మణుడిని రాముడు పంపించాడు. రావణుడు రాక్షస రాజైనప్పటికీ అటువంటి మహావ్యక్తి మరొకరు ఉండరు. లంకాధిపతి, దశాననుడు, మహారాజు అయిన రావణుడు మహా శక్తివంతుడు, పరాక్రమశాలి, గొప్ప శివభక్తుడు, వేదాలు పారాయణం చేసినవాడు, గొప్ప పండితుడు కూడా.
రావణుడి గొప్ప లక్షణాలు
జైన పురాణాల్లో రావణుడు ప్రతినాయకుడే. కానీ 64 శలాకాల పురుషుల్లో రావణుడి పేరు చేర్చడానికి ఇదే కారణం. రావణ బ్రహ్మకు అనేక విషయాల్లో విశేష జ్ఞానం ఉంది. అతడినికి అనేక రకాల తంత్రాలు, ఇంద్రజాలం, వశీకరణ వంట మంత్ర విద్యలు కూడా తెలుసు. అతడు పుష్పక విమానాన్ని కూడా రావణుడు సంపాదించాడు. అందుకే రావణుడి చివరి ఘడియల్లో సైతం అతడి నుంచి అధికారం, రాజకీయం గురించి నేర్చుకోవాలని లక్ష్మణుడికి సూచించాడు.
రామ రావణ యుద్ధం అత్యంత భీకరమైందిగా చరిత్రలో నిలిచి పోయింది. ఈ యుద్ధంలో రావణుడు రాముడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతిమ ఘడియాల్లో ఉన్నప్పుడు రావణుడిని తన సోదరుడైన లక్ష్మణుడికి జ్ఞాన బోధ చెయ్యాల్సిందిగా రాముడు కోరాడు. ఎందుకంటే రావణుడు ఈ ప్రపంచిక నీతి, రాజకీయలకు పండితుడని రాముడికి తెలుసు. అందుకే లక్ష్మణుడికి రావణుడి దగ్గర నీతి, రాజకీయం నేర్చుకోవాలని సూచించాడు. అటువంటి జ్ఞానం మరెవ్వరి దగ్గర నేర్చుకోవడం కుదరదని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. అన్న మాట విని లక్ష్మణుడు వెళ్లి మరణశయ్యపై ఉన్న రావణుడి తల దగ్గర నిలబడ్డాడు. కానీ చాలా సమయం పాటు రావణుడు లక్ష్మణుడితో మాట్లాడలేదు. ఇక లక్ష్మణుడు తిరిగి రాముడి దగ్గరకు వచ్చి, తాను ఎంతో సేపు వేచి చూశానని, అయినా రావణుడు ఏమీ మాట్లాడలేదని అంటాడు.
అప్పుడు రాముడు ఎవరి దగ్గరైనా జ్ఞానాన్ని ఆశించాలంటే.. వారి తల దగ్గర కాదు, పాదల దగ్గర నిలబడి అర్థించాలని లక్ష్మణుడికి సూచించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు రావణుడి పాదల చెంత నిలబడి జ్ఞానాన్ని అర్థించాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడికి జ్ఞాన బోధ చేశాడు. ఆ సందర్భంలో రావణుడు లక్ష్మణుడికి చెప్పిన విషయాలు అందరూ తెలుసుకోవాల్సినవే.
రావణుడు ఏం చెప్పాడు?
- ఏ శుభకార్యంలో అయినా జాప్యం తగదు. అదే అశుభ కార్యాలు చెయ్యాలన్న తలంపును వీలైనంత ఎక్కువ కాలం పాటు వాయిదా వెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ పని చెయ్యాలన్న ఆసక్తి నశిస్తుంది.
- పరాక్రమం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించకూడదు. అదే సమయంలో శత్రువుకు మనలను తక్కువ అంచనా వేసే విధంగా కూడా మనం కనిపించకూడదు.
- మానవులు, వానరుల చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదని బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందానని, నన్ను చంపేంత శక్తి సామర్థ్యాలు అటు మానవులకు, ఇటు వానరులకు లేవనే అహంకారంతో అటువంటి వరాన్ని అడిగానని.. మానవుడితో అందుకే యుద్ధానికి దిగటం తన తప్పిదమని ఉదాహారణగా చెప్పాడు.
- మిత్రుడు, శత్రువును గుర్తించే జ్ఞానం తప్పక కలిగి ఉండాలని కూడా చెప్పాడు. చాలా సార్లు ఆ జ్ఞానం లేక చాలా సార్లు శత్రువును నమ్మి నష్టపోతామని, మిత్రులను శత్రువులుగా భావించి వారిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు.
- జీవితంలో లోతైన రహస్యాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఎంతటి సన్నిహితుడైనా సరే కొన్ని రహస్యాలు రెండో వ్యక్తికి తెలియకపోవడం అవసరమని చెప్పాడు. విభీషణుడు లంకలో ఉన్నపుడు నా శ్రేయోభిలాషి, రాముడి పంచన చేరిన తర్వాత నా వినాశానానికి కారణమయ్యాడు అని రావణుడు తన అనుభవాన్నే పాఠంగా బోధించాడు.
- చివరిగా పరాయి స్త్రీ మీద కలిగే వాంఛ మంచిదికాదని అది వ్యక్తిని పూర్తిగా పతనం చేస్తుందని తన అనుభవసారాన్ని జ్ఞానంగా లక్ష్మణుడికి అందించాడు రావణాసురుడు.
- Also read : తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు - ఇలా వాడితే, ఆరోగ్యం మీ సొంతం
- Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.