Bathukamma Wishes 2024: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే భాద్రపదమాస అమావాస్య రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి వరకూ కొనసాగుతాయి.  ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో  ప్రారంభమయ్యే వేడుకలు  దుర్గాష్టమి రోజు ( అక్టోబరు 10) వచ్చే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.


వ్యాధులు, కరువుకాటకాల బారినుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ గౌరమ్మను పూజించే వేడుక ఇది. పూలను శివలింగాకృతిలో పేర్చి ఇంటి ముందు పెట్టి ఇరుగుపొరుగువారితో కలసి ఆడిపాడుతారు. బతునిచ్చే బతుకమ్మ సంబరాలతో తొమ్మిది రోజుల పాటూ తెలంగాణలో వాడవాడలా సంబరంగా సాగుతుంది.  రాష్ట్రంలో ఉన్నవారు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో స్థిరపడిన  తెలంగాణ ఆడబిడ్డలు కూడా బతుకమ్మ వేడుకలు తప్పనిసరిగా జరుపుకుంటారు.  


ఈ ఏడాది అక్టోబరు 02న ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు అక్టోబరు 10 తో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ కొటేషన్స్ , పాటల లిరిక్స్ తో మీ బంధుమిత్రులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయండి. 



తెలంగాణ ఆడపడుచులు అందరకీ
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


తెలంగాణ ఆడబిడ్డలందరకీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే బతుకమ్మ పండుగ వేళ 
మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటూ..
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


తెలంగాణ  ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చూపే పూల వేడుక
మీకు మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


 ఆటపాటలు, కోలాటాలు
అవధుల్లేని ఆనందంతో జరుపుకునే
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


పల్లెకు కొత్తఅందాన్ని తీసుకొచ్చే పూల పండుగ
బతుకమ్మ పండుగ శుభాకాలంక్షలు


ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే
ఉమ్మెత్త పువ్వొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయప్పునే
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో..
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో..
తెలంగాణ ఆటపాటల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


తంగేడు పూల సందమామ..
మల్లెన్నడు వస్తావు.. సందమామ..
గునుగు పూల సందమామ..
బతుకమ్మ పోతుంది.. సందమామ..
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


ఉసికెలో పుట్టే గౌరమ్మ..ఉసికెలో పెరిగే గౌరమ్మ..
కుంకుమలో పుట్టే గౌరమ్మ..కుంకుమలో పెరిగే గౌరమ్మ..
పసుపులో పుట్టే గౌరమ్మ..పసుపులో పెరిగే గౌరమ్మ..
మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన 
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


బంగారు గుండ్లుపేరు గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ
తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు



మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో.. ఓ మామగారు ఉయ్యాలో
ఈ పువ్వు పేరేమి ఉయ్యాలో.. చెప్పరాదు మామ ఉయ్యాలో
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. నాకు తెల్వబోదే ఉయ్యాలో
ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. మీ అత్తనడుగే ఉయ్యాలో
మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


మొదటి రోజు నుంచి బతుకమ్మలు తయారుచేసి ఆడిపాడి...చివరి రోజైన సద్దులబతుకమ్మ రోజు భారీగా బతుకమ్మని తయారుచేసి ఆటపాటల అనంతరం తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. 


Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!


Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!