ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది ఎప్పడెలాంటి రూపు దాల్చుతుందో చెప్పటం కష్టం. పచ్చబొట్టును ఒకప్పుడు ట్రైబల్ ఆర్ట్ గా పరిగణించే వారు. కానీ ఇప్పుడిదే ట్రెండ్. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అంతా పచ్చబొట్లు వేసుకుంటున్నారు. వాటిని టాటూలు అని అంటున్నారు. రకరకాల డిజైన్లు సృజనాత్మకంగా శరీరం మీద టాటూ గా వేసుకోవడానికి చాలా మంది ఇష్టం చూపుతున్నారు. అతి పురాతనమైన ఈ కళ గురించి, దీనిలో ఉపయోగించే డిజైన్ల గురించి శాస్త్రం కొన్ని నియమాలను కూడా చెప్పింది. కొన్ని రకాల టాటూ డిజైన్లను ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని పండితులు చెబుతున్నారు. పచ్చబొట్టు కథా కమామిషు గురించి తెలుసుకుందాం.


పగిలిన అద్దం


పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదు. పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం. పగిలిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. ఇలాంటి చిహ్నాన్ని శరీరం మీద వేసుకోవడం అశుభం అని వాస్తు చెబుతోంది. ఇది జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానిస్తుంది. ఇటువంటి టాటూలు శరీరం మీద వేయించుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు వెంటాడవచ్చు. వైఫల్యాలు కూడా ఎదురు కావచ్చు.


తిరగబడిన గుర్రపు డెక్క


గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం. అయితే ఇది తిరగబడిన విధంగా టాటూ వేయించుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయి. ఇలా తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్ జీవితంలోని పాజిటివిటిని హరించే అశుభ సంకేతంగా భావిస్తారు. ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టే.


పగిలిన గడియారం


పగిలిన గడియారం దురదృష్టానికి సంకేతం. వాస్తు ప్రకారం పగిలిన గడియారం ఆగిపోయిన సమయానికి చిహ్నం. అలాంటి పచ్చ బొట్టు శరీరం మీద వేసుకుంటే జీవితంలో పురోగతి కుంటుపడుతుంది.


ఏడుపు ముఖం


విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి. దురదృష్టాన్ని ఆకర్శిస్తాయి. జీవితంలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. వాటిని వ్యక్తం చేసే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. దు:ఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద పచ్చబొట్టు గా వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి విశాదకర, విషణ్ణ వదనాల డిజైన్లను టాటూలుగా వేసుకోకూడదు. అలాగే మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం వంటి టాటూలు కూడా మీ జీవితానికి హానికరమే. చూశారుగా.. ఇకపై టాటూల విషయంలో జాగ్రత్తగా ఉండండి.


Also read : Vastu Tips In Telugu: కెరీర్ ముందుకు సాగాలంటే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటిస్తే సరి


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial