Navratri 2025: చిన్న పిల్లలను దేవుని వరంగా భావిస్తారు. ఆడపిల్లలు ఇంటికి లక్ష్మిదేవిగా భావిస్తారు. అలాంటి లక్ష్మిదేవి నవరాత్రుల సమయంలో ఇంట్లో ఉదయిస్తే అప్పటి నుంచి ఆ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయా?
హిందూ మతంలో నవరాత్రి సమయం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. నవరాత్రి తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను పూజిస్తారు. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 02 వరకూ ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవరాత్రి సమయంలో పిల్లలు పుట్టడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ 10 రోజుల్లో జన్మించిన పిల్లలు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు.
వాస్తవానికి బిడ్డ..ఏ నెలలో ఏ వారంలో లేదా ఏ పక్షంలో పుట్టినా అది శుభప్రదమే. వారి భవిష్యత్ మొత్తం.. వారు జన్మించిన శుభ నక్షత్రం, లగ్నం, ఆ సమయంలో గ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటుంది. అన్నీ శుభయోగాలున్నప్పుడు జన్మించిన పిల్లలు ఉన్నతంగా ఉంటారు. చెడు గ్రహాలు కలయికలో జన్మించిన పిల్లల జాతకంలో జన్మదోషం ఉంటుంది. అయితే నవరాత్రి సమయంలో జన్మించిన పిల్లలపై ప్రతికూల ప్రభావం చాలా తక్కువ ఉంటందని చెెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
నవరాత్రిలో జన్మించిన ఆడపిల్ల అదృష్టవంతురాలు
నవరాత్రి సమయంలో అబ్బాయిలు , అమ్మాయిలు ఇద్దరూ పుడతారు. ఈ సమయంలో పిల్లల పుట్టుక చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా భక్తిపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఇల్లు లోగిళ్లలో ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న సమయంలో జన్మించడం వల్ల వారిపై అన్నీ అనుకూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు. శరన్నవరాత్రుల్లో జన్మించే ఆడపిల్లలపై దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని విశ్వాసం. నవరాత్రి శుభసమయంలో ఆడపిల్ల పుట్టడం అదృష్టం అని, ప్రత్యేక శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
నవరాత్రిలో మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే, మీరు చాలా అదృష్టవంతులు.. మీ కుమార్తె భవిష్యత్తు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే నవరాత్రిలో జన్మించిన ఆడపిల్లపై దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు.
నవరాత్రిలో జన్మించిన ఆడపిల్ల ఎలా ఉంటుంది?
జ్ఞానానికి ధనవంతురాలు
నవరాత్రి సమయంలో జన్మించిన ఆడపిల్లలు జ్ఞానానికి ధనవంతులు. అమ్మవారి అనుగ్రహంతో ఈ అమ్మాయిలు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అదే సమయంలో, నవరాత్రిలో జన్మించిన ఆడపిల్లలు మతపరమైన స్వభావం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక పనులలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు.
అదృష్టానికి ధనవంతురాలు
నవరాత్రి 9 రోజులలో జన్మించిన ఆడపిల్ల తన కోసం మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆమె జీవితంలో అలాంటి లక్ష్యాలను సాధిస్తుంది, ఇది కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
దసరా నవరాత్రుల్లో ఈ 5 చిన్న చిట్కాలు పాటించండి! ఆర్థిక, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి!