Continues below advertisement

గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 18 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 18 Episode)

ఒక్కరోజు ఫర్నిచర్ షాప్ కి వెళ్లొచ్చి బాగా అలసిపోయానంటాడు మనోజ్. ఇంటికి వచ్చినప్పటి నుంచీ తెగ బిల్డప్ ఇస్తాడు. అందర్నీ పిలిచి పనులు చెబుతుంటాడు. ప్రభావతి సపోర్ట్ తో రోహిణి కూడా చెలరేగిపోతుంటుంది. పొద్దున్నే కాఫీ ఇచ్చిన మీనాతో..మేడపైకి వెళ్లి మనోజ్ కి ఇవ్వు అంటుంది. నాకేం అవసరం..తనకి పెళ్లికాలేదా? భార్య లేదా? అని ఇచ్చిపడేస్తుంది మీనా. నువ్వు ఇలానే ఉండమ్మా అని సత్యం కూడా సపోర్ట్ చేస్తాడు. ప్రభావతి కక్కలేక మింగలేక మీనావైపు ఉరిమి చూస్తుంటుంది.ఇంతకీ వాడు నిద్రలేచాడా అని సత్యం అడిగితే..ఎప్పుడో లేచి రెడీ అయి ఉంటాడు అంటుంది. ఇంతలో రోహిణి వస్తుంది. ఏమ్మా సర్ లేచి రెడీ అయ్యారా అని సత్యం సెటైరిక్ గా అడుగుతాడు. ఇంకా లేవలేదు మావయ్యా అని రోహిణి చెప్పగానే నవ్వుతుంది మీనా. ఉడుక్కుని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది రోహిణి. వెనుకే వెళుతుంది ప్రభావతి.

Continues below advertisement

మంచానికి అడ్డంగా నిద్రపోతున్న మనోజ్ ని.. చంటిపిల్లాడిని బుజ్జగించినట్టు బతిమలాడుతుంటుంది తల్లి ప్రభావతి. ఇంతలో సత్యం వచ్చి.. నువ్వు, రోహిణి కలసి వెనుకేసుకురావడం వల్లే ఇలా తయారయ్యాడు, ఇకనైనా బుద్ధిచెబితే పని చేసుకుంటాడు లేదంటే పార్కులో పడుకున్నట్టే తయారవుతాడు అంటాడు సత్యం. మీరు అలాగే మాట్లాడుతారంటూ భర్తపై కోప్పడుతుంది ప్రభావతి. మొత్తానికి రోహిణి, ప్రభావతి గోల భరించలేక నిద్రలేస్తాడు మనోజ్. ఆ తర్వాత మీనా దగ్గరకు వెళ్లి మనోజ్ రోహిణి కోసం ప్రత్యేకంగా పెద్ద మెనూ చెబుతుంది. ఇంట్లో అందరికోసం వంట చేస్తాను కానీ వాళ్లకోసమే ప్రత్యేకంగా చేయను అని చెప్పేస్తుంది మీనా.

ఇక.. సత్యం ఫ్యామిలీలో ఎప్పుడెప్పుడు చిచ్చుపెడదామా అని ఆలోచించిన శ్రుతితల్లి..తాను కొన్న సోఫాని ఉపయోగించి అస్త్రంగా ప్రయోగించాలి అనుకుంటుంది. అనుకున్నదే తడవుగా తన భర్త పేరుమీదుగా కూతురుకి గిఫ్ట్ ఇస్తున్నట్టు పంపిస్తుంది. ఆ సోఫా వచ్చే సమయానికి ఇంటిముందు కారు తుడుచుకుంటున్న బాలు చూసి..ఇదేంటి ఇక్కడకు తీసుకొచ్చారని అడుగుతాడు. సురేంద్ర గారు మీ ఇటి అడ్రస్ ఇచ్చారని చెబుతారు ఆ పనివాళ్లు. వెంటనే శ్రుతి తల్లికి కాల్ చేసిన బాలు..మీరు కొన్న సోఫా మీరే తీసుకోండి అని వెనక్కు పంపించేస్తాడు. అంతే...నిప్పు రాజుకుంటుంది.

శ్రుతి తల్లి కూడా తగ్గేదే లే అన్నట్టు..మనోజ్ షాప్ కి వెళ్లి..సోఫా రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా అంటుంది. బోణీ బేరం అనుకుని లక్షలు చూసి మురిసిపోయిన మనోజ్ షాక్ అవుతాడు. ఆ సోఫా నా కూతురికోసం గిఫ్ట్ గా కొన్నాను..నువ్వు ఎదగడం మీ బాలుకి ఇష్టంలేదంటూ బాలు మీనాపై చాడీలు చెబుతుంది. ఆ మాటలు విని మనోజ్ రోహిణి బాలుని టార్గెట్ చేస్తారు.

నీ కారణంగా మా షాప్ లో మాకు అవమానం జరిగిందంటూ ఫైర్ అవుతారు. అసలు సోఫాను ఎందుకు వెనక్కు పంపించావ్ అని బాలుని నిలదీస్తుంది రోహిణి. ఆవిడ కొన్న సోఫా మనింటికి ఎందుకు పంపించారని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు బాలు. మా అమ్మ నాకు గిఫ్ట్ గా పంపించింది నీకెందుకు అని అడుగుతుంది శ్రుతి. రవి కూడా మధ్యలో నీ పెత్తనం ఏంటి అంటాడు. నువ్వే మొత్తం వెనుకుండి నిడిపించావా అని మీనాపై ఫైర్ అవుతుంది ప్రభావతి.  మొత్తానికి ఎప్పుడూ బాలు-మీనాను సపోర్ట్ చేసే శ్రుతి రవి...బాలుని నిలదీస్తారు. ఓవరాల్ గా బోణీ బేరం అని సోఫా కొన్నట్టే కొని.. ఇంట్లో చిచ్చు పెట్టడంలో సక్సెస్ అయింది శ్రుతి తల్లి.