Ammayi garu Serial Today Episode రూప, రాజుల ప్రేమ కథకి సూర్యప్రతాప్‌, విరూపాక్షిలు గతంలోకి వెళ్లిపోతారు. నిజానికి రూప, రాజులు సూర్యప్రతాప్‌కి విరూపాక్షి మీద ప్రేమను తట్టి లేపడానికి వాళ్ల గతాన్నే వాళ్ల ముందు కనిపించేలా నటిస్తారు.  సూర్యప్రతాప్‌,విరూపాక్షిలు ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. రాజు, రూపలు పరిచయమిలా.. పరిమళములా.. మనసునంటి వదలదేలా అంటూ 8 వసంతాల సినిమాలో పాటకు డ్యాన్‌ చేస్తారు. 

Continues below advertisement

రాజు, రూపలు డ్యాన్స్ చేయడం సూర్యప్రతాప్‌, విరూపాక్షిలు గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఫ్లాష్‌బ్యాక్‌లో సూర్యప్రతాప్‌, విరూపాక్షి కూడా అదే పాటకు ఫెర్మామ్ చేసినట్లు చూపిస్తారు. డ్యాన్స్ తర్వాత రాజు కాలం తమ జంటని విడదీసిందని చెప్పి దిష్టి వేసిందని అనడంతో రూప మైక్ పట్టుకొని పచ్చని జంటని విడదీసిన ఆ పాపం ఎవ్వరిది అని పాట పాడుతూ ఎమోషనల్ అయి ఏడ్చేస్తుంది. విరూపాక్షి చాలా ఎమోషనల్ అయిపోతుంది. సూర్యప్రతాప్‌ని పెళ్లి చేసుకోవడం సూర్యప్రతాప్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం.. రాఘవతో విరూపాక్షి ఎఫైర్ పెట్టుకున్నట్లు చూపిస్తారు. రూప పాటకు విరూపాక్షి కూడా గతం గుర్తు చేసుకొని ఎమోషనల్ అయి పాడుతూ ఏడుస్తుంది. రూప కూడా ఏడుస్తుంది. రాజు రూపని ఓదార్చుతాడు. 

సూర్యప్రతాప్‌ కోపంగా లేచేస్తాడు. ఇక అందరూ రూప అలియాస్ రుక్మిణి రాజుల యాక్టింగ్ బాగుందని క్లాప్స్ కొడతారు. లవ్‌ స్టోరీ అదిరిందని బంటీ చెప్పడంతో ఇది మీ నాన్న లవ్‌ స్టోరీ కాదు బంటీ మీ తాతయ్య అమ్మమ్మల లవ్‌స్టోరీ అని రూప చెప్తుంది. బంటీ తాతయ్య దగ్గరకు వెళ్లి తాతయ్య ఇది మీ లవ్‌స్టోరీనా కానీ మిమల్ని చూస్తే అలా కనిపించదు.. అసలు మీరు ఇద్దరూ సరిగా మాట్లాడుకోరు.. ఒకరికి ఒకరు ఎదురు పడరు.. ఎందుకు తాతయ్య అని అడుగుతాడు. అమ్మమ్మ మీరు గ్రేట్ అమ్మమ్మ తాతయ్యని చాలా బాగా ప్రేమించారు మీరు మళ్లీ అలా ఉంటే చూడాలని ఉందని అంటాడు. సుమ వాళ్లు కూడా విరూపాక్షి గ్రేట్ అని అనుకుంటారు. బంటీ మాటలకు విరూపాక్షి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

Continues below advertisement

విజయాంబిక దీపక్‌తో వీళ్ల యాక్టింగ్‌కి మీ మామయ్య ఎక్కడ మారిపోతాడో అనుకున్నా అస్సలు మారలేదు ఇప్పుడు నా కడుపు చల్లగా ఉందని తెగ సంబర పడిపోతుంది. రూప, రాజులు విరూపాక్షి దగ్గరకు వెళ్తారు. మీ ఇద్దరూ చెప్పిన స్టోరీకి గతంలోకి వెళ్లిపోయా రూప అంతా చూశాక ఆ సూర్య ఈ సూర్య ఒక్కడేనా అని అనిపిస్తుంది. నా మీద అంత ప్రేమ చూపించిన సూర్య ఇలా మారిపోయాడేంటి అని అనిపిస్తుంది. సూర్య కోసం అంత దిగి వచ్చిన నేను దిగజారే పని ఎలా చేస్తానని అనుకున్నాడు. కొంచెం కూడా నమ్మకం లేదా అని ఏడుస్తుంది. నీలాగే పెద్దయ్యగారు కూడా ఆలోచిస్తూ ఉంటారు త్వరలోనే మీరు కలుస్తారు ధైర్యంగా ఉండండి అని రాజు చెప్తాడు. 

కోమలి రూప దగ్గరకు వచ్చి హలో మీరు నన్ను తిట్టించి మీరు మార్కులు కొట్టేస్తారా అని అంటే.. ఇప్పటి వరకు ఏం నేనేం చేయలేదు.. ఇప్పుడు చేస్తా నాన్నకి ఇష్టమైన భరతనాట్యం చేస్తా మార్కులు కొట్టేస్తా అని అంటుంది. దానికి కోమలి ఆ భరతనాట్యం ఏదో నేను చేసి నాన్నకి నా మీద ఉన్న కోపం తగ్గించేస్తా అని కోమలి అంటుంది. రాజు, రూపలు కోమలి వెళ్లిపోయిన తర్వాత నవ్వుతారు. రాజు రూపతో పొద్దున్న కొంచెం కోటింగ్ అయింది ఇప్పుడు అసలైన కోటింగ్ తనకు ఉంది చూద్దాం పద అని వెళ్తారు. కోమలి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి మీకు నచ్చే మీ కోపం పోయేలా చేస్తానని చెప్పి అందర్ని కూర్చొపెడుతుంది. మరోవైపు ఆనంద్, రాఘవల్ని దీపక్ రౌడీలు పట్టుకుంటారు. దీపక్‌కి కాల్ చేసి విషయం చెప్తారు. దీపక్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.