Ayodhya Ram Mandir: ఉత్తర ప్రదేశ్ అయోధ్యలో రాముడిని దర్శించుకోవడానికి వాతావరణంలో మార్పులు రావడంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తుల కోసం దర్శన సమయాన్ని మార్చింది. వివిధ హారతులకోసం కొత్త షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఇందులో ఉదయం జరిగే మంగళ హారతి ఉదయం 4:30 నుంచి 4:40 వరకు ఉంటుంది. రామలాలా దర్శనం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై 11:45 వరకు కొనసాగుతుంది. వేసవికాలంతో పోల్చితే దర్శన సమయాలు కొంత తగ్గాయి..కానీ..భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రస్ట్ అధికారులు. ఉదయం , రాత్రి సమయాల్లో మార్పు చేయడం వల్ల భక్తులకు దర్శనం కోసం తగినంత సమయం లభిస్తుంది. అదే సమయంలో కొత్త షెడ్యూల్ ను పాటించాలని ... దర్శనం సమయంలో ఆలయ నియమాలను గౌరవించాలని భక్తులందరినీ కోరింది.
దర్శనం కోసం సమయం
రామలాలా మంగళ హారతి 4:30 నుంచి 4:40 వరకు ఉంటుంది. ( వేసవిలో ఈ హారతి 4 గంటలకు ఉండేది)
ఉదయం 6:30 గంటలకు శృంగార హారతి , 7:00 గంటలకు రామలాలా దర్శనం ప్రారంభమవుతుంది ( వేసవిలో 6:30 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది)
ఉదయం 9:00 గంటలకు రామ్ లాలా దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేస్తారు ( వేసవిలో దర్శనం ముగింపు సమయం రాత్రి 10 గంటలు) ఉదయం మొదటి భాగంలో రామలాలా దర్శనం 11:45 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.
11:45 నుంచి 12:00 వరకు భోగ హారతి ఉంటుంది.. దాదాపు గంటపాటూ దర్శనం నిలిచిపోతుంది 12:15 గంటలకు మొదటి చెకింగ్ నుంచి దర్శనం ప్రవేశం మూసివేస్తారు
భోగహారతి తర్వాత రాత్రి 9 గంటలవరకూ దర్శనాలు కొనసాగుతాయి..మధ్యలో భోగ్ హారతి కోసం కొద్దిసేపు దర్శనాలు నిలిపివేస్తారు రామమందిర ట్రస్ట్ ఈ నిర్ణయాన్ని భక్తుల సౌలభ్యం కోసం తీసుకుంది, తద్వారా దర్శనంతో పాటు భక్తులు కూడా సమయానికి హాజరు కాగలుగుతారు.
ముఖ్య సూచనలు
దర్శనం ఉచితం, కానీ ఆన్‌లైన్ బుకింగ్ (srjbtkshetra.org) ద్వారా చేసుకోవడం మంచిది. మొబైల్‌లు తీసుకెళ్లకూడదు.
ప్రత్యేక దర్శనాలు: మంగళవారం, శృంగార హారతి ఎంట్రీకి పాస్ అవసరం
భక్తుల సంఖ్య: రోజుకు 3 లక్షల మంది భక్తులు వస్తున్నారు..ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది.
ఈ నూతన షెడ్యూల్ కి అనుగుణంగా భక్తులు తమ అయోధ్య యాత్రను ప్లాన్ చేసుకోవాలని ట్రస్ట్ సభ్యులు సూచించారు
మరిన్ని వివరాలకు ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ చూడండి.
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయంసీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపంఆజానుబాహుం అరవిందదళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామి
కార్తీక మహాపురాణం కథ DAY-1.. కుక్కగా జన్మించిన నిష్టురికి మోక్షం ఎలా లభించింది? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
కార్తీక మహాపురాణం కథ DAY-2 బ్రహ్మరాక్షసులకు శాప విమోచనం, కార్తీకమాసంలో దీపారాధనతో మోక్షం ఎలా సాధ్యం? కథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచలంలో కార్తీక శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేసి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
ఆలయం నుంచి వరుసగా 17వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
18వ ఎనర్జీ పాయింట్ నుంచి 44వ ఎనర్జీ పాయింట్ వరకూ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి