YS Jagan On Balakrishna: అసెంబ్లీలో జరిగిన బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అసెంబ్లీ మాట్లాడాల్సిన మాటలేంటి, ఆయన మాట్లాడింది ఏంటీ? అని అన్నారు. పనిపాట లేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్‌కు బుద్ధి లేదని కామెంట్స్ చేశారు. అలా మాట్లాడినందుకు ఎవరి మానసిక స్థితి బాగాలేదో ఆలోచించుకోవాలని సూచించారు.   

Continues below advertisement

తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి... కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. కనీసం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వారికి జీపీఎస్‌, ఓపీఎస్‌, జీతాల పెంపు ఇలా ఏదీ లేకుండా చేశారని విమర్శించారు. వారు తిరగబడేసరికి సమస్యను డైవర్ట్ చేయడానికి దీపావళి కానుక అంటూ మోసం చేశారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 11 డీఏలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని పెండింగ్‌లో నాలుగు డీఏలు ఉన్నాయని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ కష్టాలు ఉన్నా ఉద్యోగులకు అన్యాయం చేయలేదని సకాలం రావాల్సినవి అన్నీ ఇచ్చామని తెలిపారు. పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉంటుందని ఇంత వరకు ఛైర్మన్‌ను కూడా నియమించలేదని కామెంట్ చేశారు.

రెండేళ్లలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 31వేల కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై ఎటూ తేల్చడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయంచేస్తున్నారని తాము గతంలో తీసుకొచ్చిన వాటిని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కరోనాలాంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు చేతులు ఎత్తేసేవాడని ఎద్దేవా చేశారు.  ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని, విద్యార్థులకు ఫీజులు, చదువులు సక్రమంగా అందడం లేదన్నారు. వైద్యరంగంలో పూర్తిగా నీరుగారిపోయిందని, ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్నారు. 

Continues below advertisement

గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆరోపించారు. గ్రామసచివాలయం, వలంటీర్ లాంటి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని పొలిటికల్ గవర్నెన్స్‌  వల్లే రాష్ట్ర అతలాకుతలం అవుతుందని  విమర్శించారు. ఏపీలో ఇప్పటికీ డీపీఏ,యూరియా దొరకడం లేదని చెప్పారు. బీమా సంగతి పట్టించుకునే వారు లేరని వాపోయారు. వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేయలేదని చెప్పారు.