Arunachalam Giri Pradakshina: జూలై 10 ఆషాఢ పౌర్ణమి, గురు పూర్ణిమ.. ఈ రోజు అగ్నిలింగ క్షేత్రం అయిన అరుణాచలం భక్తులతో నిండిపోతుంది. గిరిప్రదక్షిణ చేసేందుకు భక్తులు పోటీపడతారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వెళతారు.
ఈ సందర్భంగా తమిళనాడులో ఉన్న అరుణాచ ల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. ఆ ప్యాకేజీల వివరాలు ఇవే..ఇక్కడ పేర్కొన్న వివరాలతో పాటూ అదనపు వివరాల కోసం https://www.tgsrtc.telangana.gov.in వెబ్ సైట్ లో చూడండి..
షాద్ నగర్ to అరుణాచలం
అరుణాచల క్షేత్రంలో ఈనెల 10న గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు షాద్ నగర్ నుంచి బయలుదేరుతుంది. జూలై 8 రాత్రి 7 గంటలకు షాద్‌నగర్ నుంచి బయలుదేరి జూలై 9న ఉదయం 6 గంటలకు ముందుగా కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ వినాయకుడి దర్శనం అనంతరం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ చేరుకుంటుంది. అక్కడ అమ్మవారిని దర్శించుకుని గోల్డెన్ టెంపుల్ టూర్ ముగిసిన తర్వాత జూలై 9 రాత్రికి అరుణాచలం క్షేత్రానికి చేరుకుంటుంది బస్. జూలై 10 ఆషాఢ పూర్ణిమ రోజు గిరి ప్రదక్షిణ ఉంటుంది. పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు బయలుదేరి జూలై 11 ఉదయానికి తిరిగి షాద్ నగర్ డిపోకు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు అయితే 3 వేల 600, పిల్లలకు 2వేల 400. సందేహాలున్నా, టికెట్ బుక్ చేసుకోవాలన్నా 94409 19113, 9490021433, 91826 45281, 99592 26287 నంబర్లకు కాల్ చేయవచ్చు
జనగామ to అరుణాచలం
జనగామ జిల్లా కేంద్రం నుంచి అరుణాచలానికి వెళ్లే స్పెషల్ బస్సులు వీకెండ్ లో బయలుదేరనున్నాయి. టూర్ లో భాగంగా శ్రీకాళహస్తి వాయులింగం, కంచి అమ్మవారిని, పంచభూతలింగం అయిన అరుణాచలం దర్శనం అనంతరం..అక్కడి నుంచి బయలుదేరి శ్రీపురం, కాణిపాకం దర్శనం చేసుకుని తిరిగి జనగామ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ ధర పెద్దలకు 4 వేల 500, చిన్నారులకు 2 వేల 500. జగిత్యాల నుంచి మరో ప్యాకేజీలో భాగంగా జూలై 08 న ప్రారంభమయ్యే టూర్ కాణిపాకం, వెల్లూరు, అరుణాచలం, జోగులాంబ దర్శనంతో రెండు రోజుల పాటు సాగుతుంది.
తొర్రూరు డిపో నుంచి అరుణాచలం వెళ్లే బస్సులు.. బీచపల్లి, గద్వాల, అరుణాచలం, శ్రీపురం, కాణిపాకం కవర్ చేస్తాయి. పెద్దలకు 5వేల 500, పిల్లలకు 4 వేల 100 రూపాయలు టికెట్ ధర. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకునేందుకు, టికెట్ బుక్ చేసుకునేందుకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే... 8074474984, 9959226053, 7032182456
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - పౌర్ణమి వేళ అగ్నిలింగ క్షేత్రంలో భక్తుల రద్దీ ఎందుకుంటుంది... పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
అరుణాచల గిరిప్రదక్షిణ - ఈ 44 ఎనర్జీ పాయింట్స్ మిస్ చేయొద్దు ..ఇదిగో రూట్ మ్యాప్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!
అరుణాచలంలో కనిపించే టోపీ అమ్మ ఎవరు? ఆమెకు శక్తులున్నాయా? ఆమెను ముట్టుకునేందుకు, కాళ్లు మొక్కేందుకు భక్తులు ఎందుకు ఎగబడతారు.. పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి