Sankashta chaturthi : సంక‌ష్ట‌ చతుర్థి అంటే కష్టాలను నాశనం చేసే ప్రతిజ్ఞ. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిథిని సంక‌ష్ట‌ చతుర్థి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థిని గజానన సంకష్ట చతుర్థి అంటారు. ఈ వ్రతాన్ని సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఆచరిస్తారు. సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం వేళలో మహిళలు గణపతిని పూజించి, రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఈ ఉపవాసాన్ని ముగిస్తారు. గజాన‌న సంక‌ష్ట‌ చతుర్థి నాడు ఉపవాసం ఉండేవారికి వినాయకుడు అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. గజాన‌న‌ సంకష్ట చతుర్థి పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకుందాం.


ఆషాఢ మాసంలో గ‌జాన‌న‌ సంకష్ట చతుర్థి ఈ సంవ‌త్స‌రం జూలై 6 తేదీ గురువారం నాడు జరుపుకొంటారు. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్లే ముందు విష్ణువు సృష్టి బాధ్యతను శివుడికి అప్పగిస్తాడు. అందుకే ఈ కాలంలో శివపూజ ఎక్కువగా జరుగుతుంది. గణేశుడు పరమశివుని కుమారుడే కాబట్టి ఈ మాసంలో వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల శివుడు, పార్వతి, గణ‌ప‌తి అనుగ్రహం లభిస్తుంది.



  • పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి 6 జూలై 2023 గురువారం ఉదయం 06.30 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జూలై 07, 2023 శుక్రవారం తెల్లవారుజామున 03.12 గంటలకు ముగుస్తుంది.

  • గణపతి పూజకు అనుకూల సమయం: ఉదయం 10:41 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు.

  • సాయంత్రం పూజ సమయాలు: 7:23 నుంచి 8:29 వరకు


గజాన‌న సంక‌ష్ట‌ చతుర్థి ప్రాముఖ్యత
గణేశ పురాణం ప్రకారం, సంక‌ష్ట‌ చతుర్థి రోజున ఉపవాసం చేయడాన్ని ఒక వ్యక్తికి ఉన్న‌ అన్ని రకాల కష్టాల నుంచి బయటపడటానికి ఉత్తమమైన ప‌రిహారంగా పరిగణిస్తారు. ఆటంకాలను తొలగించే గణ‌ప‌తి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందుతాడని చెబుతారు. ఈ వ్రత మహిమ వల్ల సంతోషం, అదృష్టం క‌లిసివ‌స్తాయి. మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులను విఘ్న‌నాయ‌కుడు తొలగిస్తాడు. మీ ప‌నులు విజయవంతంగా పూర్తి చేయడానికి మీకు సహాయం చేస్తాడు.


గజన సంకష్ట చతుర్థి పూజా విధానం
- ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించండి.
- పూజా పీఠాన్ని ఈశాన్య దిశలో ఉంచండి. దానిపై శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని ప‌ర‌చండి.      
   తర్వాత దానిపై గణేప‌తి ప్ర‌తిమ‌ ఉంచాలి.
- అప్పుడు గణేశుడిని ధ్యానించి, ఉపవాస వ్రతం ప్రారంభించండి.
- ఈ సమయంలో గణేశుడికి నీరు, దూర్వం, అక్షత, తమలపాకులు, టెంకాయలు సమర్పించండి.
- అప్పుడు భక్తితో "గం గణపత‌యే నమః" అనే మంత్రాన్ని జపించండి.
- గణ‌ప‌తికి లడ్డూలు లేదా బూందీ లేదా పసుపు మోదకం సమర్పించండి.
- గణేశుడిని పూజించిన తర్వాత రాత్రి చంద్రుడిని పూజించండి.
- చంద్రునికి పాలు, చందనం, తేనెతో అర్ఘ్యం సమర్పించండి. ఆపై మీ ఉపవాసాన్ని ముగించండి.


గజాన‌న సంక‌ష్ట‌ చతుర్థి పూజ ప్రయోజనాలు
- ఈ సంక‌ష్ట‌ చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.
- మీకు మంచి సంతానం కలుగుతుంది.
- జీవితంలోని అన్ని సమస్యలకు ప‌రిష్కారం ల‌భిస్తుంది.
- మీరు శ్రేయస్సు పొందుతారు.
- పునర్జన్మ ఉండ‌దు.
- గణేశ లోకంలో మోక్షాన్ని పొందుతారు.


Also Read : బ్రహ్మచారులిద్దరూ ఒకే విగ్రహంలో కొలువుతీరిన ఆలయం..


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.