Akhuratha Sankashti Chaturthi 2023
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్నికార్యాలకూ, పూజలకూ ప్రధమంగా పూజలందుకునేవాడు. విజయాన్ని, జ్ఙానాన్ని ప్రసాదించే గణపయ్యను… లంబోదరుడు, గణనాధుడు. వినాయకుడు, విఘ్ననాధుడు అని ఎన్నో పేర్లతో పూజలు చేస్తాం. ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా విఘ్నాలు లేకుండా వినాయకుడిని పూజిస్తారు. ఈ ఏడాదిలో ఆఖరి సంకటహర చతుర్థి డిసెంబరు 30న వచ్చింది. సంకటహర చతుష్టి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిధులలో ప్రధానమైనది చవితి తిధి. ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థిని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. రెండోది సంకటాలు తొలగించమని వేడుకుంటూ సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు.
సంకటహర చతుర్థి ముహూర్తం
చతుర్థి తిథి ప్రారంభం- డిసెంబర్ 30, 2023 ఉదయం 8.17 మొదలవుతుంది
చతుర్థి తిథి ముగింపు- డిసెంబర్ 31, 2023 ఉదయం 10.50 నిమిషాల వరకు
Also Read: మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇదే సరైన సమయం, డిసెంబరు 30 రాశిఫలాలు
సంకటహర చతుర్థి పూజా విధానం
నిత్యదీపం వెలిగించుకునేవారు ఈ రోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి దీపం వెలిగించాలి. ఆరోగ్యం సహకరించి ఉండగలిగేవారు ఈ రోజు కూడా ఉపవాసం ఉంటే మంచిది. వినాయకుడి ప్రతిమకి అభిషేకం చేయాలి. పూలు సమర్పించాలి. అలాగే గణేషుడికి దుర్వాలు సమర్పించడం అత్యంత పుణ్యఫలం.లడ్డూ ప్రసాదం పెట్టాలి. ఈ వ్రతంలో చంద్రుడి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సాయంత్రం పూట చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. సూర్యాస్తమయం తర్వాత కూడా వినాయకుడికి దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3,5,11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.
Also Read: 2024 ఈ రాశివారితో చెడుగుడు ఆడేసుకుంటుంది!
సంకటహర చతుర్థి రోజు చదువుకోవాస్సిన కథ
ఒకరోజు ఇంద్రుడు తన వాహనంలో బృఘండి అనే రుషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. ఘర్ సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో...ఓ పాపాత్ముడి దృష్టి సోకి ఇంద్రుడు వెళ్ళే వాహనం భూమిపై అర్థాంతరంగా ఆగిపోయింది. వాహన వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సురసేనుడు వెంటనే బయటకి వచ్చి దాన్ని చూశాడు. ఇంద్రుడిని చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు. ఈ రాజ్యంలో పాపాలు చేసిన వ్యక్తి ఎవరో దృష్టి సోకదాంతో వాహనం మార్గమధ్యలో ఆగిపోయిందని ఇంద్రుడు చెప్తాడు. ఆ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుందని రాజు అడిగాడు. ఈరోజు పంచమి, నిన్న చతుర్థి .. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్తాడు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరూ కూడా కనిపించరు. అప్పుడే అటుగా ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళడం సైనికుల దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైనాయి స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని అడిగితే.. నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమి తినలేదు. చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది. దీంతో ఆమె చతుర్థి ఉపవాసం చేసినట్టు అయ్యింది. ఈరోజు మరణించిందని చెప్తారు. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకుంటారని చెబుతారు. మృతదేహం పై నుంచి వీచిన గాలి ఇంద్రుడి వాహనం ఆగిపోయిన చోటకి చేరింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అప్పుడు ఇంద్రుడి వాహనం బయలుదేరింది. సంకటహర చతుర్థి రోజు ఉపవాసం చేయడం అంత పుణ్యఫలం అని చెబుతారు పండితులు.
Also Read: ఈ రాశివారికి 2024 లో కెరీర్ బావుంటుంది కానీ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు తప్పవ్!
Also Read: ఈ రాశివారిని 2025 వరకూ శని ఆడుకుంటుంది కానీ ఆర్థికంగా బలపరుస్తుంది
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం