Vastu Tips : నేటి కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎంత కష్టపడి పనిచేసినా..చివరకు చేతిలో చిల్లగవ్వ మిగలదు. ఏం చేయాలతో తెలియని ఆందోళన నెలకొంటుంది. ఆర్థిక నష్టాలే కాదు..ఇంట్లోనూ అశాంతి నెలకొంటుంటుంది. మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఈ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు డబ్బు దాచుకునే వాలెట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితి బాగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం మీ వాలెట్ లేదా పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే మీ ఆర్ధిక కష్టాలు తగ్గి... మీరు సంపన్నులు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గోమతీ చక్రం:
మీ పర్సులో గోమతి చక్రం పెట్టుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా స్థితి మంతులు అవుతారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. గోమతీ చక్రాలను మీ వాలెట్ లేదా పర్సులో బేసి సంఖ్యలో ఉంచుకోవాలి.
శ్రీ యంత్రం:
అత్యంత పవిత్రమైన శ్రీ యంత్రాన్ని పర్సులో ఉంచుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ యంత్రాన్ని బ్యాగులో పెట్టుకోవడంతో పాటు, లక్ష్మీదేవిని మనసులో స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఫలితం లభిస్తుంది
బియ్యం:
మీ పర్సులో కొన్ని అక్షతలను వేసుకోవడం ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారం అక్షతలు అనేవి మీకు శుభానికి చిహ్నంగా చెప్పవచ్చు. ఇది సంపద , డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుంది.
లక్ష్మీదేవి ఫోటో:
సంపదకు అది దేవత అయినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పర్సులో లేదా వాలెట్లో ఉంచుకోవడం ద్వారా, మీరు డబ్బు పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
పెద్దలు ఇచ్చే డబ్బు:
మీరు పెద్దల నుంచి ఆశీర్వాదంగా పొందిన డబ్బులను పర్సులో ఉంచుకోవడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, లేదా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఆశీర్వదిస్తూ డబ్బులు ఇచ్చినట్లయితే వాటిని మీ పర్సులో ఉంచుకోవడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు.
వెండి నాణెం:
వాస్తు ప్రకారం వెండినాణెం మీ పర్సులో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. వెండి లక్ష్మీదేవికి ప్రతీక. అందుకే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం మీరు పర్సులో వెండి నాణెం ఉంచుకుంటే మంచిది
అలాగే మీ పర్సులో ఎర్రటి దారం కూడా ఉంచుకున్నట్లయితే ఇది మీకు దుష్టశక్తుల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక మీరు పర్సులో దాచుకునే వస్తువుల్లో ఏమేం దాచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . మీరు పర్సులో ఎల్లప్పుడూ సూదులు వంటి లోహపు వస్తువులను ఉంచుకోకూడదు. ఇవి దరిద్రాన్ని ఆకర్షిస్తాయి. అలాగే మీరు పర్సులో చినిగిన ఓట్లను కూడా ఎప్పుడు ఉంచుకోకూడదు. అలాగే మీరు పర్సులో వెంట్రుకలు వంటివి కూడా ఉంచకూడదు.
Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!
గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..