Jagan Dream :  అధికార వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో ఇప్పటివరకు సిద్ధం క్యాడర్ సమావేశాల పేరుతో ఎన్నికల హీట్ పుట్టించింది. ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రచారాన్ని ఉద్దృతం చేసింది. నాలుగో సిద్ధం సభ పదో తేదీన అద్దంకి దగ్గర జరగనుంది.  ఓ వైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే.. ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీలను నియమించి "అదే నాకు ఒక కల ఉంది"  అనేమరో సరి కొత్త నినాదంతో వైఎస్సార్ సీపీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోంది.                                                   


రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు వేశారు. ఇక సిద్ధం పోస్టర్లు కనిపించవు.  కొనసాగింపుగా   'నాకు ఒక కల ఉంది'. రాష్ట్రంలోని ప్రతి నగరం ప్రతి వాడలో కార్మికులతో, పిల్లలతో, అవ్వతాతలతో, అక్కచెల్లమ్మలతో, రైతులతో జగన్ ఉన్న ఫోటోతో మీ కల నా కల అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు.  దీంతో ప్రజల కలే తన కలగా చెబుతూ అవి నేరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ మొత్తం మీ కల నా కల ప్రచారంలో మొత్తం 6 వర్గాల ప్రజలకు చెందిన హోర్డింగ్ లు ఉన్మాయి.                          


రైతుల కల , కార్మికుల కల,  విద్యార్ధుల కల,  యవత కల ,  అవ్వాతాతల కల ,  అక్కచెల్లెమ్మల కల  అని ప్రచార పోస్టర్లు సిద్ధం చేశారు.  2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్ద పీఠ వేస్తు, ప్రతి పథక లబ్దిదారులుగా మహిళల పేర్లనే చేర్చారు.  తద్వారా ప్రతి ఇంటి యాజమని మహిళేనని, వారి చేతికే పథకాల మొత్తాన్ని అందిస్తున్నారు. అక్కల చెల్లమ్మలను మిలయనీర్లుగా చేశామని చెప్పే జగన్ వారి కలలను సాకారం చేసేందుకే పనిచేస్తున్నాని అనేక సార్లు తెలిపారు. వారి ప్రతి కాలను తన కలగా భవించి నేరవేర్చే దిశగా అడుగులు వేస్తామని జగన్ హోర్డింగ్లు ద్వారా చెబుతున్నారు.                                          


ఐ ప్యాక్ నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సిద్ధం  పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలుహిట్ అయ్యాయని ఇప్పుడు కల పేరుతో  నిర్వహించే ఎన్నికల ప్రచారసభలు కూడా హైలెట్ అవుతాయని భావిస్తున్నారు. ఈ కల పోస్టర్లు ఇక  రాష్ట్రం మొత్తం ముంచెత్తే అవకాశం ఉంది.