ఆంధ్రప్రదేశ్ ( AP ) నుంచి వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) తరపున రాజ్యసభ సభ్యులుగా  విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) , నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) , ఆర్ కృష్ణయ్య, ( R Krishnayya )  బీద మస్తాన్ రావు ( Beeda Mastan Rao ) పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa ) అధికారికంగా ప్రకటించారు. ఈ నలుగురిలో విజయసాయిరెడ్డి ఇప్పటి వరకూ ఎంపీగానే ఉన్నారు. ఆయనకు పొడిగింపు లభించింది. మిగతా ముగ్గురు మాత్రం తొలి సారిగా ఎంపీలు అవుతున్నారు. 


ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్


నిరంజన్ రెడ్డి లాయర్. ఆయన సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను వాదిస్తూ ఉంటారు. ఇటీవల చిరంజీవితో ఆచార్య ( Acharya Producer )  సినిమాను కూడా నిర్మించారు. వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలతో తన లాయర్‌కు జగన్ రాజ్యసభకు చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది.  మరో రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు నెల్లూరు జిల్లా ( Nellore ) కావలికి చెందిన నేత. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. గత ఎన్నికల తర్వాత రాజ్యసభ హామీతోనే వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు బీసీ కోటా కింద చాన్సిచ్చారు. 


వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?


ఇక మరో స్థానానికి తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు అవకాశం ఇచ్చారు. ఆయన నేపధ్యం పూర్తిగా తెలంగాణకు ( Telangana Leader )  చెందినదే.  రాజ్యసభ సీటు కోసం వైఎస్ఆర్‌సీపీలో చాలా మంది పోటీ పడుతున్నప్పటికీ వారెవరికీ ఇవ్వకుండా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా పిలిచి మరీ ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభకు అవకాశం ఇవ్వటం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  వైఎస్ఆర్‌సీపీలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. 


ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !


రాజ్యసభకు మైనార్టీ కోటా కింద సినీ నటుడు అలీకి అవకాశం ఇస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఆయనను ప్రత్యేకంగా పిలిచి మరీ .. చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలీకి నిరాశే ఎదురయింది. వైఎస్ఆర్‌సీపీకి అసెంబ్లీలో పూర్తి స్థాయి బలం ఉన్నందున నాలుగు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం కానున్నాయి.