మహిళా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం శుభ పరిణామం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ బిల్లుపై స్పందించిన షర్మిల మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సహకారం కాబోతుందని షర్మిల వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల జాప్యం తర్వాత మహిళా బిల్లుపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు.
మహిళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభాలో సగమైన మహిళలకు సమాన హక్కులు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో కొంతమేరకు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ బిల్లు ప్రవేశ ప్రవేశ పెట్టడం కోసం మోడీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం విషయంలో రాజకీయలకు అతీతంగా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రవర్తించాలని వైఎస్ షర్మిల విన్నవించారు. రాజకీయాలకు పోయి ఈ బిల్లు ముఖ్య దేశాన్ని నీరుగార్చకుండా ఉండాలని ఆకాంక్షించారు. దశాబ్దాలుగా పోరాడుతున్న మహిళ రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరూ మద్దతు ఇవ్వాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
మహిళల కళ సాకారమవుతున్న వేళ మహిళలందరికీ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు మహిళ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన ఏదో ఒక ప్రతిపక్ష పార్టీ అడ్డుపడుతుందని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో బిల్లు తీసుకువస్తుంది, దీనిపై విధివిధానాలు ఏమిటో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ముందడుగు అభినందనీయమని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ డిమాండ్ ను మోడీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువు అయిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రివర్గానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని అన్ని పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ఉన్న అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్.....
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడోవంతు సీట్లు మహిళ అభ్యర్థులకు కేటాయించబడతాయని వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మహిళ రిజర్వేషన్ బిల్లును గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయేది. అన్ని పార్టీలు ఈ బిల్లుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడం సరి అయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ... ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు.