Jagan On MLAs : మార్చిలోగా పనితీరు మెరుగుపరచుకోండి,లేదంటే కఠిన నిర్ణయాలు తప్పవు...పార్టీ నేతలకు సీఎం జగన్ ఇచ్చిన వార్నింగ్..ఒకరు కాదు...ఇద్దరు కాదు...ఏకంగా 60 మంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి నుంచి ఓ వైపు సంక్షేమ పథకాలు,మరోవైపు గడప గడపకూ మన ప్రభుత్వంలో తప్పనిసరిగా పాల్గొనాలని దిశానిర్ధేశం చేసారు. గడప గడపకూ మన ప్రభుత్వంపై జరిగిన వర్క్ షాప్‌లో ఇన్‌సైడ్ వివరాలు ఇవే.
అరవై మంది ఎమ్మెల్యేలు మొక్కుబడిగా గడప గడపకూ వెళ్తున్నారన్న జగన్
గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్ షాప్ లో మరో సారి నేతల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్ జగన్. రోజుకు 6 గంటల పాటు ప్రజల్లో ఉండాలని చెప్పినప్పటికీ...కేవలం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. మరి కొంతమంది పూర్తిగా పాల్గొనకుండా దాటవేశారు. ఈ జాబితాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు,ఇంచార్జిలు కూడా ఉన్నారు.మంత్రులు అప్పలరాజు,గుడివాడ అమర్నాధ్,జయరాం,విడదల రజని,అంబటి తో పాటు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్,నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, హిందూపురం ఇంచార్జి ఇక్బాల్ కూడా ఉన్నారు. మార్చి నెలాఖరు వరకూ పనితీరు మెరుగుపడాలని . లేదంటే తన నిర్ణయం తప్పదని హెచ్చరించారు.సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చని సూచించారు.
ఉదయం ట్యాబ్‌ల పంపిణీ - సాయంత్రం ఇళ్ల వద్దకు !
ఈనెల 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్‌ల పంపిణీ మొదలవుతుందన్నారు. పగలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని...సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని జగన్ సూచించారు. వచ్చే నెల ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీలో వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాల్సిందేని మరోసారి స్పష్టం చేసారు జగన్..ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలన్నారు.
రాష్ట్రంలో పేదవారికి -పెత్తందార్లకు మధ్య యుద్దం
రాష్ట్రంలో పేదవారికి -పెత్తందార్లకు మధ్య యుద్దం జరుగుతుందన్న సీఎం...మనకు ఓటేయని వారి ఇంటికి కూడా ఖచ్చితంగా వెళ్లాలని చెప్పారు.ఇక్కడే జగన్ మరికొన్న విషయాలు కూడ గుర్తు చేశారు.గ త ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్దికి వైసీపీ నుండి గెలిచిన అభ్యర్దికి ఎక్కువ ఓట్ల మెజార్టి లేదని వివరించారు. ఇందులో భాగంగా కొన్ని నియోజవర్గాల్లో ఓటింగ్ శాతం గురించి జగన్ లెక్కలు తో సహ వివరించారు.ఇప్పుడు మూడున్నర సంవత్సరాల తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సర్వే వివరాలు కూడ ప్రస్తావించటం విశేషం,..
అందర్నీ సభలో చూడాలనుకుంటున్నానన్న సీఎం
ఇదే సమయం జగన్ తాను నిర్వహించిన సమావేశంలో చిన్న సెంటిమెంట్ టచ్ కూడ ఇచ్చారు.తాను చేస్తున్న కార్యక్రమాలు,సర్వేలు...ఎవరి కోసమో కాదని మనందరం తిరిగి సభలో ఉండాలన్న ఆలోచనలో నుండి మాత్రమే పెట్టిందని జగన్ అన్నారు.175 స్దానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు,ఇంచార్జ్ లలో ఏ ఒక్కరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదన్న జగన్, అందరినీ మరోసారి చట్ట సభల్లో చూడాలని ఉందన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం చర్యలు తప్పవని కూడ జగన్ అన్నారు. మనందరం ఎంత కసితో పని చేస్తామో, కమిట్ మెంట్ కూడ అంతకన్నా ఎక్కువ ఉండాలన్నారు. గడప...గడప అంటే మార్నింగ్ ,ఈవినింగ్ వాకింగ్ లా కాకుండా,ప్రతి గడపలో ఉన్న కుటుంబ సభ్యలును మన ఇంటిలో మనిషిగా భావించి వారితో సంభాషించాలని,వారి మనస్సులోకి వెళ్ళగలిగితే,మరో పార్టికి చెందిన నేత వెళ్లినా కూడ వారికి మనమే గుర్తుకు వచ్చేలా ఉండాలని జగన్ అన్నారు.